పుట:Aliya Rama Rayalu.pdf/183

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పేరునకుమాఱుగా సదాశివదేవరాయల నామమునే వ్యవహరించు చుండుట వింతగా గన్పట్టలేదు కాబోలు !

'ఫెరియా - యి - సౌజా' అనునాతడు సదాశివరాయలు కర్ణాటరాజనిప్రశంసించినా డటగాని 1559 లో తనకు దెలిసినవిజయనగరరాజు రామరాయ లొక్కడేయని తెలిపినవా డట !

రామరాయలమంత్రియు అనుకూలమిత్రుడు నగురామయామాత్య తోడరమల్లు తన 'స్వరమేళకళానిధి' యను గ్రంథమున నుదాహరించిన విషయము బహుశ: ఈకాలమునె దెలుపు నట.

అతడు తనమంత్రిచేవినిర్మితమైన 'రత్నకూట^ మను రాజభవనము గలిగియుండెను. దేవతాభవన మగువైజయంతమును మించి నిర్మింపబడుటచేత నాతని కాశ్చర్యమును గొల్పుచుండె నట ! ఈరాజభవనము హంసలతోగూడి చల్లనైనసలిలసరస్సులనుగలిగి చిత్రప్రతిమలచే నలంకరింపబడినట్టి విశాలములయిన యారామములతో జుట్టుకొనబడి యుండె నట.

ఈకాలముననే 1559 రామరాయలు రాజ్యాంగవ్యవహారముల నన్నిటిని తనసోదరుల కప్పగించి తాను సంగీతసాహిత్యగోష్టిలో నుండె నట.

"ఈరత్నకూట భవనమున నాసీనుడై యుండి సంగీతసాహిత్యాదివిద్యలం దాఱితేఱిన పండితులతో దనకాలమును