పుట:Aliya Rama Rayalu.pdf/182

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గలిగినది యొక్కటి. కర్ణాటికాశాసన సంపుటములనుండి యెత్తిచూప గలిగినారుకాని యది యేసందర్భమున నెవ్వనిచే నేప్రదేశమున బుట్టబడినదో వివర మేమియు దెలిపి యుండలేదు. 1564 సంవత్సరములో వీరప్రతాప సదాశివదేవరాయలు తానుసింహళ ద్వీపమును కొల్లగొట్టితి ననిచిత్తూరుమండలములో తిరుత్తనిగ్రామమున లిఖింపజేసినశాసనము నేలయెత్తి కొనరు ? విజయనగరసామ్రాజ్యమునకు లోబడినమధురమండలాధీశ్వరు లగువిశ్వనాథనాయకుడును, వానికుమారుడు కృష్ణప్పనాయకుడును 1560 సంవత్సరము మొదలుకొని 1570 సంవత్సరమువఱకు ప్రతిసంవత్సరము వ్రాయించిన దానశాసనములు సదాశివదేవరాయలు రాజ్యముచేయుచున్నట్టు లాతని నామము గన్పట్టుచుండగా వానిం బెడచెవిం బెట్టనేల ? పెడచెవిని బెట్టుటయెగాదు; విజయనగర సామ్రాజ్యములోని హిందూప్రజలు సదాశివదేవరాయలు మరణముజెందె ననియూహించి యాతని మఱచిపోయి రామరాయలనే విజయనగరచక్రవర్తిగాబేర్కొని నప్పుడు ఫెరిస్తా మొదటివానినిగుఱించి యేమియు జెప్పక రామరాయలనే ప్రత్యర్ధిసామ్రాజ్యప్రభు వనివ్రాయుట వింతయేమియులే దట ! నిజాముశాహి రాజులచరిత్ర గ్రంథ మగు 'బురహాన్ - ఇ - మాసీర్‌' అనుగ్రంథమునువ్రాసిన 'ఆలీఇబుఅజీజ్‌అల్లాతపతాబాయి' హిందువులు మఱచిపోయినను తానుమాత్రము మఱువక యెచటనో యొకటి రెండుప్రదేశములం దక్క గ్రంథమునంతటను రామరాయల