పుట:Aliya Rama Rayalu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వకాలమున నొకసామ్రాజ్యములోని సామంతప్రభువులు మండలాధిపతులుకూడ దమ పేరిటనాణెములు ముద్రించుకొనుసంప్రదాయానుకరణము గలదు. అందువలన నొక నాణెముపై రామరాయలపేరు కన్పట్టినంతమాత్రమున రామరాయలు విజయనగరసామ్రాజ్యమునకు బట్టాభిషిక్తు డయిన సార్వభౌము డనుటకు బరమప్రమాణము కాజాలదు.

ఇంకశాసనములనుగూర్చి చెప్పవలసినది కొంత గలదు. రామరాయలయెడ దోషారోపణము జేయ దలంచినవారు రామరాయల మరణానంతరమును, సదాశివదేవరాయల మరణానంతరమును, లిఖింపబడిన శాసనములనుండిగాని గ్రంథములనుండిగాని సాక్ష్యమును జూప బ్రయత్నించుటకంటె నాతనికాలమున నాతనిచేవ్రాయింప బడిన శాసనములనుండి గాని గ్రంథములనుండిగాని సాక్ష్యప్రమాణములను జూప బ్రయత్నించుట యుత్తమమార్గము. ఏదేనియొక శాసనములో సదాశివదేవరాయలపేరు లేకరామరాయలపే రుదహరించినంతమాత్రముచేత నద్దాని నాధారపఱచుకొని వానిపేరిటశాసనములు సామ్రాజ్యము నలుప్రక్కల గన్పట్టుచుండగా వానినెల్లను విస్మరించి సదాశివరాయని కారాగృహవాసశిక్షకు బాల్పఱచి యాతని బ్రపంచము మఱచిపోయినతరువాత రామరాయలు దనంతటతానే పట్టాభిషిక్తుడై రాజాధిరాజని రాజపరమేశ్వరుం డని ప్రకటించుకొనియె నని సిద్ధాంతము చేయసాహసించుట సంభావ్య మగునా ? ఈసందర్భమున వీరుచూప