పుట:Aliya Rama Rayalu.pdf/172

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లాతనిచక్రవర్తినిగా శిరసావహించి పరిపాలనచేయుచున్నట్టు దెలుపుటకుగాను నాతనిసందర్శించి నమస్కరించు చుండిరని 'కోటో' వ్రాయుచున్నాడట ! 1565 లో జరిగినతల్లికోట యుద్ధములో రామరాయలు మరణముజెందెనుగదా. ఇంక నడుమనున్న దొక్కసంవత్సరము, 1564 మాత్రమె గదా. అట్లు మూవురుసోదరులు చక్రవర్తిని సందర్శించి పాదాక్రాంతులయిన దీయొక్కసంవత్సరమె కాబోలు ! ఈహీరాసు ఫాదిరియె మఱియొకచోట "తల్లికోటయుద్ధములో రామరాయలు మరణము నొందుటయు దమకు నపజయము గలుగుటయు విని పాఱివచ్చి తిరుమలదేవరాయలు తనయొక్కయు, తనసోదరులయొక్కయు భార్యలను పుత్త్రికాపుత్త్ర సంతానమును, మంత్రివర్గమును, సామ్రాజ్యములోని సామంతప్రభువర్గమును సేనానులను, సైన్యములను, అదివఱకు 6 సంవత్సరములనుండి కఠినకారాగారశిక్ష ననుభవించుచు నదియె ప్రథమపర్యాయము ప్రజలకు గన్పఱచబడిన చక్రవర్తి సదాశివదేవరాయలను వెంటగొని విజయనగరమునుండి తరలించుకొనిపోయినట్లు ఫ్రెడరిక్కు దెలిపి యున్నా"డని వ్రాసియున్నాడు. [1] ఎవరివ్రాతనమ్మవలసినది?

ఇట్లుపరస్పరముపొందికలేక విదేశస్థులువ్రాసినవ్రాతలను సరిగావిమర్శింపక తనకిష్టమువచ్చినట్లుగా జతపరచి దుర్ర్భమలపాలయి రామరాయల శీలమును గుఱించి దురభిప్రాయము

  1. I bid p. 221