పుట:Aliya Rama Rayalu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లని యనుచుండగా 'కోటో' యనునాతడు రామరాయలొక్కడేకారకు డనివ్రాయుచున్నాడట. కోటోవ్రాసినదేనిజము కావచ్చునని హీరాసు వ్రాయుచున్నాడు. ఎందుచేత నన దమయన్నగా రిట్లుచేయుటకిష్టపడక యాతనిపై తిరుగుబాటుచేసి యుద్ధముచేసి రట. ఇందెంతసత్యము గలదో వెనుక విమర్శించి చూతముగాక! సురక్షితమై, బలాడ్యమై యినుపతల్పులచే నొప్పెడునొకదుర్గములో నుంచి కావలివాండ్రను గాపుంచెనట. కాని యతడాదుర్గ మెక్కడనున్నదో వ్రాసియుండలే దట. ఇట్టిపని 1550 - 1552 సంవత్సరములనడుమ నెప్పుడో జరిగియుండె ననిఆంక్విటిల్ - డు - ఫెరాన్ తెలుపుచు దరువాత నిట్టిఖైదులో 13 సంవత్సరము లుంచబడె ననివ్రాసి యున్నాడట! సదాశివదేవరాయల మరణానంతరము రామరాయలాక్రమించి రాజ్యము పరిపాలించెననివ్రాసినవా డితడే ఇతనిమాటలను నమ్మిహీరాసుఫాదిరి 1550 మొదలు 1563 వఱకు సదాశివదేవరాయలు రామరాయలచే ఖైదుగావింపబడి యుండె నని వ్రాయుచున్నాడు. ఈదురదృష్టవంతు డయినరాజు సంవత్సరమున కొకతూరి మాత్రము రత్నసింహాసనము పై గూర్చుండ బెట్టబడి ప్రజలకు బ్రదర్శింప బడుచుండెనని ఫ్రెడరిక్కు వ్రాసి యున్నా డట! [1] అట్లు చక్రవర్తిని ప్రదర్శించుపద్ధతి 1563 వ సంవత్సరము తరువాత విరమింపబడిన దట! కాని సంవత్సరమునకొకసారి మూవురుసోదరు

  1. The Aravidu Dynasty of vijianagar, p. 31 - 32.