పుట:Aliya Rama Rayalu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేంకటపతిరాయలే సదాశివరాయనికుమారుని జంపించుటకును హక్కుదారుడైనరాజును సింహాసనభ్రష్టునిజేయుటకును కారకు డనివ్రాయుటచేత తమయూహను స్థిరపఱచుచున్నట్టు గన్పట్టుచున్న దట. తుంటిమీద గొట్టిన మూతిపండ్లురాలిన వన్న ట్లున్నది. సదాశివరాయనికుమారుని జంపినవాడనివ్రాసినవ్రాత వీరివాదమున కనగాసదాశివరాయలను జంపినవా డనినిర్ధారించుటకు పరమప్రమాణముగా గైకొనుట యెట్లు? ఇవన్నియు వట్టిదుర్ర్భమతో గూడినయూహాకల్పనలే గాని నిజముగా సదాశివరాయ లెట్లుమరణము జెందెనో సత్యమైనట్టియు, లిఖితమూలక మైనట్టియు బ్రమాణముగా గైకొనదగినసాక్ష్య మేమియు లేకున్నప్పుడు విదేశీయులు పరస్పరము బొందికలేకుండ వ్రాసినవ్రాతలను విశ్వసింపరాదు. ఏదియెట్లున్నను 1570 సంవత్సరమువఱకు సదాశివరాయలు బ్రదికియున్నట్టు శాసనములవలన స్పష్టముగా దెలియుచున్నది. దీని నెందుకువిశ్వసింపరాదో బోధపడ కున్నది. ఈవిషయ మటుండనిచ్చి రామరాయలు సదాశివదేవరాయలను నిజముగా ఖైదుచేసియుండెనా యనువిషయమును విమర్శింపవలసి యున్నది.

సామ్రాజ్యభారమువహించి పరిపాలనము చేయుటకు యుక్తవయస్సువచ్చినవెనుక రామరాయలు సదాశివదేవరాయలను ఖైదులోనుంచెనట! ఇటాలియాదేశస్థు డయినఫ్రెడరిక్కు రామరాయలును వానిసోదరులిర్వురు నిందులకు నుత్తరవాదు