పుట:Aliya Rama Rayalu.pdf/166

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దేవరాయని కంకితముగావింపబడిన చిక్కదేవరాయవంశావళి యనుగ్రంథమున దిరుమలార్యు డనుకన్నడకవి.

"తుళవకుళదీశ్వరనరసవీర నరసింగకృష్ణాచ్యుతంబరాయ దృవరతఱువాయిం ముదదోళిళయం పూఱిది సదాశివరాయంగె సేనానియెనిసిదఆంధ్రకులదరామరాజం, నిజరాజంగెద్రనిడాంధ్రకర్ణాట సామ్రాజ్యమం, సౌర్జ్య పతికార్యదోళర్పితప్రాణననిసి, ఒర్మయుత్తరదిగ్విజయదోళుద్వృత్త యవనసేనాచక్రమ నోక్కలిక్కి యశశ్శేషనప్పిను,........."

అనగా దుళువకులములోనివారయిన యచ్యుతరాయాదులకు బిమ్మటసదాశివరాయలు రాజ్యమునకు వచ్చెననియు వానిసేనాధ్యక్షుడును, ఆంధ్రకులము వాడయినరామరాజు ద్రవిడాంధ్ర కర్ణాటసామ్రాజ్యమును బరిపాలింపుచు బతికార్యముకొరకు బ్రాణము లర్పించి యుత్తరదిగ్విజయసందర్భమున మహమ్మదీయులతో జరిగినయుద్ధములో మృతి జెంది యశశ్శేషు డయ్యెననియు వ్రాసియున్నవాడు. ఈతిరుమలార్యకవి చిక్కదేవరాయనికి బ్రధానమంత్రి. ఆరవీటివంశమునకు బ్రతిస్పర్ధులుగా నుండి తద్వంశీయు డైనమూడవ శ్రీరంగరాయలతో యుద్ధముచేసి జయించి స్వాతంత్ర్యమును బొందినవాడు. [1] సదాశివరాయలను త్రోసిరాజని పరిపాలనచేసినవాడు రామరాయలుగాక వానితమ్ము డయినయెఱతిమ్మరా

  1. Sources of vijianagar History, p. 302 - 303