పుట:Aliya Rama Rayalu.pdf/165

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చేత వారివ్రాతలతో హిందూరాజులకు బ్రతిపక్షు లయిన దక్కనుసుల్తానుల దర్బారులలోనుండి యెప్పుడును రామరాయనిపట్ల సౌమనస్యత జూపజాలనిచరిత్రకారుల స్వవచనావ్యాఘాతములను జతపఱచి హిందూరాజుల శాసనములలోని భావములతోను హిందూకవుల కవితారచనములలోని భావములతోను సమన్వయింప బ్రయత్నించి హీరాసుఫాదిరి స్వచ్ఛములయిన భావములకు విరుద్ధములయినట్టియు, అపార్ధముల నిచ్చునట్టియు వ్యాఖ్యానములనుగావించి యాభాస సిద్ధాంతములను జేసి యిమ్మహాపురుషవర్యుని జీవితమును యశమును గళంకపఱచుటకు సాహసించెను. సదాశివరాయలమరణానంతరము నూఱు సంవత్సరములవెనుక నీదేశమున సంచారముసలుపు చున్న పోర్చుగీసుబాటసారి యగు "ఆంక్విటిల్ - డు - ఫెర్రాన్" అను నాతడు "సదాశివరాయల మరణానంతరము రామరాయలు రాజుగా బేర్కొనబడియె" ననివ్రాసినా డట ! ఫ్రెడరిక్కనునాతడు రామరాయలు రాజసింహాసన మధిష్ఠించినాడనియు రాజని వ్యవహరింపబడినా డనియు వ్రాసినా డట ! అందువలన రామరాయలు రాజధానీనగరమున బట్టాభిషిక్తుడైనట్టు గన్పట్టుచున్న దని 'హీరాసు' వ్రాయుచున్నాడు. [1] మొదటిబాటసారి యీదేశమునసంచారము సలిపినకాలముననే అనగా గొంచెమించుమించుగా 1687 మొదలు 1704 వఱకు గల నడిమికాలమున నున్నమైసూరుప్రభు వగుచిక్క

  1. The Aravidu Dyanasty of vijianagar, p. 37