పుట:Aliya Rama Rayalu.pdf/160

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సైన్యములకును బోరాటము జరుగుచు కుతుబ్షాగోల్కొండ సామ్రాజ్య మస్తమించు దైన్యస్థితి యేర్పడియెను.

ఈవిధముగా నాలుగుమాసములు గడచినవెనుక జగదేవరావు పానగల్లు, రావెలకొండ, గణపురదుర్గములను రామరాయలకు వశపఱపు డనితద్దుర్గాధిపతు లగుతెలుగునాయకుల బ్రోత్సహించెను. ఇంద్రకొండదుర్గముయొక్క బీగములను తద్దుర్గాధిపతి యగుకాశీరావు రాయల కొసంగివేసెనట.

అప్పుడు రామరాయలపక్షమున నున్నబీడరుసుల్తా నగు ఆలీబరీదుషాకు గూడభయము పుట్టి సంధిగావింతు ననియు, నతనిప్రధానమంత్రి యగుముస్తఫాఖానుని తనవద్దకు బంపవలసిన దనియు రహస్యముగా నొకలేఖనువ్రాసి ఇబ్రహీమ్‌కుతుబ్షాకు బంపెనట. ఆప్రకార మాపత్తులోమునిగియున్న ఇబ్రహీము ముస్తఫాఖానుని ఆలీబరీదుషాకడకు బంపెను. అప్పుడు జగదేకరావును నెట్లయినసామవిధానమున వశ్యపఱచుకొనవలసిన దనిహితోపదేశము గావింపబడియె నట. ముస్తఫాఖాను వానియుపదేశమును బాటించి జగదేకరావుతోడిమైత్రిని సంపాదించె నట. అతడువానిని ఆలీఆదిల్‌షాకడకు గొనిపోవ వారెల్లరు నాలోచించి ముస్తఫాఖానును, ఆలీబరీదుషాయును, ఆలీఆదిల్‌షాయును, జగదేకరావునురామరాయలకడకు గొని వచ్చి సంధికార్యమునుగుఱించి ప్రశంసలు జరిపి రట. మనస్సులో నంతగా నిష్టములేకున్నను రామరాయలు గణపురము,