పుట:Aliya Rama Rayalu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తద్దుర్గము నొసంగుదు మని వాగ్దత్తముచేసెను. రామరాయలందునకు సమ్మతించి వెంటనే ముట్టడిమానివేయవలసిన దని సేనానుల కాజ్ఞచేసి యావిషయమును విజాపురసుల్తానుకు దెలియజేసెను. అంతరామరాయలును, విజాపురము, గోల్కొండ, బీడరుసుల్తానులును తమతమసైన్యములను మరల్చుకొనిపోయి సురక్షితముగా దమతమరాజధానులను జేరుకొనిరి.

కాని యిట్టిసాహాయ్యమును ఇబ్రహీమ్‌కుతుబ్షా చేసి నందుకు హుస్సేనునిజాముషా పరమానందమునుబొంది యామరుచటిసంవత్సర మనగా 1558 సంవత్సరమున కుతుబ్షాతో వివాహసంబంధము కలిగించుకొన గోరి మౌలానా ఇనాయతుల్లాను గోల్కొండనగరమునకు బంపించెను. ఉభయసుల్తానులు నాసంవత్సరమున కళ్యాణిదుర్గసమీపమున గలిసికొనుటకును, అచ్చట తనకొమార్తను హుస్సేను ఇబ్రహీమున కిచ్చివివాహము చేయుటకును, ఆమహోత్సవము ముగిసిన వెనుక నుభయులసైన్యములును కళ్యాణిదుర్గమును ముట్టడించి స్వాధీనపఱచుకొనుటకును మఱియొకసంధి గావించుకొనిరి.

ఆప్రకార మేర్పాటుచేసికొన్న కాలమునకు సరిగానుభయసుల్తానులు నదివఱకే సమకూర్చుకొన్న సైన్యములతో వచ్చి నియమితస్థానమున గలిసికొనిరి. అచటవారనుకొన్న రీతిని హుస్సేనునిజాముషా తనపెద్దకొమరిత 'బీబీజామల్లీ' అనునామెను మహావైభవముతో ఇబ్రహీముకుతుబ్షాకు నొసంగి వివాహముగావించెను. ఇట్టిమహోత్సవములతో నొక