పుట:Aliya Rama Rayalu.pdf/148

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దున ద్రొక్కటపడుచున్నారనియు, కనీసపక్షమింకొకమాసమయిన ముట్టడివిడువక కృషిసలుపవలయు ననియు బహువిధముల బ్రార్థింపగా రామరాయ లంగీకరించి దుర్గమును స్వాధీనపఱచుకొనుటకై గట్టిప్రయత్నము సేయవలసిన దనితనసేనానుల కెల్లరకు నుత్తరు వొసంగెను. అంతటితో నిరుత్సాహము జెంది యూరకొనక గోలకొండసుల్తా నగు ఇబ్రహీముకుతుబ్షా అహమ్మదునగరమునుండి దుర్గములోనివారికి నాహార పదార్థములు తనసైన్యమునడుమనుండిచేర్చుటకును, ఫిరంగులు కాల్చెడుమనుష్యులు దుర్గములోనికి బోవుటకును రహస్యముగా మార్గముల నేర్పాటు గావించెను. కాని విజయనగర సైన్యములు మిగులదీక్షతో బోరాడుచు దుర్గప్రాకారములను సమీపించుటనుగాంచి సహింపజాలక అహమ్మదునగరమును గొప్పవిపత్తునుండి తప్పించవలయు నన్నదృడనిశ్చయముతో ఇబ్రహీమ్‌కుతుబ్షా కడపటిప్రయత్నము గావించెను. తనకు ముఖ్యమంత్రియు సైన్యాధ్యక్షుడును నగుముస్తఫాఖానుని రప్పించి యెట్లయినను ముట్టడిమాను నట్లురామరాయలను బ్రేరేపింపవలసిన దనియు, వినకున్న తమసైన్యములు ముట్టడినిమాని గోల్కొండకు మరలిపోగల వనిచెప్పి రావలసినదిగా రాయలకడకు బంపించెను. అట్లారాయబారమును శిరసావహించి రాయలకడకు బోయి శక్తికొలదియుక్తి వాదములను సర్వవిధముల గావించి తుదకురహస్యముగా దనప్రభువుపక్షమున ముట్టడిమాని మరలిపోయినపక్షమున కొండపల్లిసర్కారును