పుట:Aliya Rama Rayalu.pdf/146

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కొనుటకై దండయాత్ర సాగించెను. ఆలీఆదిల్‌షా యీవార్త విన్నవాడై రామరాయలసాహాయ్యమునకై వెంటనే కిన్వరఖానును, ఆబూ తురాబును విజయనగరమునకు బంపించెను. అంతరామరాయ లుపేక్షవహింపక గొప్పసైన్యముతో విజాపురసుల్తానును గలిసికొనుటకై బయలుదేఱి వచ్చెను. అప్పుడు రాయలును, విజాపురసుల్తానును గలిసి తమపూర్వసంధినిబంధనల ననుసరించి తమకు వచ్చితోడ్పడవలసిన దనిగోల్కొండ సుల్తా నగుఇబ్రహీమ్‌కుతుబ్షాకు నొకజాబును బంపిరి. ఇబ్రహీముకుతుబ్షా తనమిత్రు డయినహుస్సేనునిజాముషాకు వ్యతిరేకముగ వ్యవహరించుటకు తనకెంతయిష్టములేకున్నను సంధి షరతులను నిరాకరించి ప్రవర్తించినా డన్ననిందనుబొందుట రాజనీతిలక్షణము కాదని తలంచి తానుగూడ కొంతసైన్యముతో బయలుదేఱివచ్చి రాయలసైన్యములను గలిసికొనియెను. వీరలతో బీడరుసుల్తా నగుఆలీబరీదుషాకూడ వచ్చి చేరుకొనియెను. ఇట్లసంఖ్యాకము లగుమిత్రసైన్యము లహమ్మదునగరమును ముట్టడించుటకై బయలుదేఱెను. విజయనగరసైన్యములు దారిపొడవునను పట్టణములనక పల్లెలనక యహమ్మదునగరరాజ్యము నంతయు ధ్వంసముచేయు చుండిరట. ఇట్టిబలాడ్య మగుశత్రుసైన్యమును నిరోధించుట తనకు సాధ్యముకాకపోవుటచేత హుస్సేనునిజాముషా రాజధానీ సంరక్షణార్ధము తగినంతసైన్యమును, సమృద్ధికర మైనయాహారసామాగ్రిని కోటలో నుంచి తాను తప్పించుకొనిపోయి జూనారు