పుట:Aliya Rama Rayalu.pdf/144

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

జెందుటయు, వానికుమారుడు 'ఆలీఆదిల్‌షా' పట్టాభిషిక్తుడగుటయు సంభవించెను. ఈయువకుడు తనతండ్రికాలమున రాజ్యమునకు సంభవించిన నష్టములను కూడదీసికొని రాజ్యమును బలపఱచుకొనుటకై రామరాయలతో నత్యంతమైత్రి నెఱపుటకు బ్రయత్నించెను.

ఆలీఆదిల్‌షాపిన్నవా డగుట సందుచేసికొని హుస్సేనునిజాముషా యసంఖ్యాకము లగుసైన్యములతో విజాపురరాజ్యముపై దండయాత్ర వెడలెను. యువకు డయినవిజాపురసుల్తాను భయపడి స్వరాజ్య సంరక్షణమునువీడి నూర్గురురౌతులతో రామరాయలరక్షణము నాశించి విజయనగరమునకు వెళ్లెనట. ఆకాలమున రామరాయలపుత్త్రు డొకడు మరణించుటచేత నాసమయమును బురస్కరించుకొని పుత్రదు:ఖోప శాంతికై తానే స్వయముగా వచ్చితి ననిచెప్పి దు:ఖోప శమనవాక్యముల రాయల నోదార్చె ననియు, ఆత్యడు దయతో నాదరించెననియు, ఆతనిపట్టమహిషి ఆలీఆదిల్‌షాను దత్తపుత్త్రునిగా స్వీకరించె ననియు, సమ్మానార్హ సంభాషణంబులతోడను పరస్పర బహుమాన సత్కారములతోడను మూన్నాళ్ల ముచ్చటలు ముగిసినవెనుక తనయావద్విశిష్ట సైన్యములతో నహమ్మదునగరముపై దాడివెడల బ్రేరేపింప బడెననియు ఫెరిస్తావ్రాసియున్నాడు. కాని యింతచేసినను రామరాయలు వానికిదోడ్పడలే దనియు, ఆలీఆదిల్‌షా యొక్కడే విజయనగరమును విడిచివచ్చె ననియు, అప్పటినుండి విజాపురసుల్తాను దానిని