పుట:Aliya Rama Rayalu.pdf/143

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నిజాముషాతో జరిపిన సంధిషరతులతోగూడి యున్నప్రమాణపత్రమును భంగపరచి తనరాజధాని యైనగోలకొండదారి బట్టెను. ఉదయమున నీవార్త అహమ్మదునగర సుల్తానుకు దెలియరాగానే యింకనుయుద్ధముసాగించుట నిష్ర్పయోజనమనియెంచి యాతడు తనసైన్యములను మరలించుకొని యహమ్మదు నగరమునకు వెడలి పోయెను. ఇందు పైనివివరించిన జాబు వాస్తవ మయినదిగా మనము విశ్వసింపరాదు. గోలకొండసుల్తాను దర్బారులో నున్నయొక యనామక చరిత్రకారుడు తనప్రభువుగౌరవమును నిలువ బెట్టుటకై కల్పించినదిగా గన్పట్టుచున్నది. తిరుమలదేవరాయలు తనరాజ్యమును (గోలకొండ) నాక్రమించుకొను నన్నభయముచేత ఇబ్రహీముకుతుబ్షా కలుబరిగె ముట్టడినివిడనాడి స్వరాజధానికి బఱువెత్తి ననుట నిశ్చయ మనిచెప్పవచ్చును. [1]

మఱియు విజాపురసుల్తానుపై దిరుగబడిన 'ఐన్ - ఉర్‌ముల్కు'ను విజాపురరాజ్యమునుండి తఱుముటకై రామరాయలు తనతమ్ముని వేంకటాద్రిని నియోగించెను. ఇట్లునియోగింపబడి వేంకటాద్రి యాతనినోడించి రాజ్యమునుండి వెడల గొట్టగా నత డహమ్మదునగరమునకు బాఱిపోయెనుగాని హుస్సేనునిజాముషా యచట వాని జంపించెను. 1557 వ సంవత్సరమున విజాపురసుల్తాను ఇబ్రహీమ్‌ఆదిల్‌షా మరణము

  1. The Aravidu Dynasty of vijayanagar, p. 86 Note I.