పుట:Aliya Rama Rayalu.pdf/142

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


డుటయు, అట్లయ్యు నదియెవ్వరికి లాభకారిగా నుండకుండుటయు మీ రెఱుంగనిది కాదు: ఇదివఱ కెన్నడును మీపూర్వులెవ్వరు నిట్టివివాదములలో నెట్టిజోక్యమును కలిగించు కొనలేదు. అయినను ఇప్పుడు మీరు విజాపురసుల్తాను ఇబ్రహీమ్‌ఆదిల్‌షా మీకుశత్రువుగాకపోయినను అహమ్మదునగర సుల్తాను హుస్సేనునిజాముషాను గెలిపించుటకై వానిపక్షము వహించినారు. ఇబ్రహీమ్ ఆదిల్‌షా మాసహాయ్యమును కోరెను. మీరును మేమును కొంతకాలమునుండి సఖ్యతగా నుంటిమి. మీరీదండయాత్రలో హుస్సేనునిజాముషాకు దోడ్పడక శాంతముగా మీరాజధానికి మీరు మరలిపోయినయెడల యాయుభయరాజ్యములవారును వైరములను బెంచుకొనక సంధిచేసికొని సుఖముగా నుందు రనుతలంపుతో మాయీవాదమును ముందుగామీకు నివేదించుచున్నాము."

ఇట్టిబావమును దెలుపుజాబు తనమిత్రు డయినరామరాయలవద్దనుండియును, అట్టిదే మఱియొకజాబు విజాపురసుల్తాను వద్దనుండియును, ఒక్కమాఱుగా వచ్చుట సంభవించి యిబ్రహీమ్‌కుతుబ్షామనస్సును గలవరపఱిచెను. ఇంతియగాక రామరాయలతమ్ముడు తిరుమలరాజు తనయాశ్విక సైన్యముతో విజాపురసైనికుల దోడుచేసికొని పానుగల్లుమండల మాక్రమించుకొను చున్నా డనుసమాచారముగూడ దెలియవచ్చెను. అంతధైర్యము చెదరి గోలకొండసుల్తాను తనదండయాత్రను విరమించి యర్థరాత్రమువేళ తానదివరకుహుస్సే