పుట:Aliya Rama Rayalu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుల చరిత్రము వ్రాయునపుడు నిజాముషాకలుబరిగెను జయింపలేదనియు: గారణముహిందూసేనాని వేంకటాద్రి తొలగిపోవుటయే యని తెలిపియున్నాడు. ఏదియో అభిప్రాయభేదము గలిగి వేంకటాద్రి విజయనగరమునకు మరలి యుండును. అందువలన నిజాముషా తనకోరికను నెఱవేర్చుకొన లేకపోయి యుండును. అయిననుబురహాను నిజాముషా యావెనుకస్వల్పకాలములోనే మరణము బొందెను. అతనివెనుక సింహాసన మధిష్టించిన హుస్సేనునిజాముషా విజాపురసుల్తా నగుఇబ్రహీముఆదిల్‌షాతో సంధి చేసికొని స్వస్థచిత్తుడుగా నుండెను. అహమ్మదునగరము, విజాపురము నడుమ జరిగినయుద్ధములలో రామరాయలు తొరగల్లుదుర్గమునుగూడ వశపఱచు కొనియె ననిఫెరిస్తా వ్రాసి యున్నాడు.

ఇంతవఱకు విజాపు రాహమ్మదునగరసుల్తానుల నడుమ జరుగుచువచ్చిన యుద్ధములలో నహమ్మదునగరసుల్తాను పక్షమున జేరి రామరాయలు విజాపురసుల్తానుతో యుద్ధములు చేయుచుండెనుగాని 1551 సంవత్సరాంతము నుండి విజాపురసుల్తానుపక్షము నవలంబించి గోలకొండసుల్తా నగుకుతుబ్షాతోను, అహమ్మదునగరసుల్తా నగునిజాముషా తోను యుద్ధములు సలుపుచుండెను.

కలుబరిగె యుద్ధము

1555 సంవత్సరమున గోలకొండసుల్తానగు ఇబ్రహీమ్‌కుతుబ్షా అహమ్మదునగరసుల్తా నగు హుస్సేనునిజాముషా