పుట:Aliya Rama Rayalu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్లుండ, నరపతివిజయ మనుగ్రంథమున బిజ్జులునికి వెనుక వానికుమారుని విడిచి 'వీరహొమ్మాళిరాయని' వానిమనుమనిగాజెప్పి అతిశయోక్తులతో నాతని ప్రతాపమును వర్ణించి యున్నాడు కాని చరిత్రాంశముల వేనిని పేర్కొని యుండలేదు. అందువలన వీనియాధార్ధ్య మెట్టిదో గ్రహింపసాధ్యము గాదు.

రామరాయల బిరుదుగద్యములో 'కళ్యాణపుర పరాధీశ్వర' అనుబిరుద మొకటి గనంబడుచున్నది. ఆబిరుదముక్రిందనే మఱియొకచోట 'కళ్యాణపురసాధక' అనుబిరుదముగూడ గనంబడుచున్నది. మొదటిది పూర్వులనుబట్టి వంశపారంపర్యముగ వచ్చుచున్నదిగను, రెండవది స్వవ్యక్తికి సంబంధించినదిగను మన మూహింప వచ్చును. రామరాజునకు 'కల్యాణపురసాధక' యన్న బిరుద మెట్టువచ్చినదియు రాబోవు ప్రకరణమున వివరింప బడును.

ఆనెగొంది సంస్థానమునందు 'రాయవంశావళి' యను నొకగ్రంథము కలదు. ఆరాయవంశావళియు నీరాయవంశావళియు నొకేవంశావళికి సంబంధించిన వని మనము గ్రహింపవచ్చును.

ఆగ్రంథమునుబట్టి చూడగా నందుడనురాజు కిష్కింధలో (ఆనెగొంది) 1014 మొదలు 1076 వఱకును, అతని కుమారుడు చాళుక్యరాజు 1076 మొదలు 1117 వఱకు పరిపాలనము చేసి రనియు, వీనికిమువ్వురు పుత్త్రులు గలరనియు