పుట:Aliya Rama Rayalu.pdf/139

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కళ్యాణిదుర్గమును స్వాధీనపఱచుకొనుటకై పున:ప్రయత్నముసేయ మొదలుపెట్టెను. ఈసమాచారము బురహాన్‌నిజాముషాకు దెలియవచ్చినతోడనే యతడు రామరాయలకు దెలియ జేసెను. అంతరామరాయలు తాను రాచూరుదుర్గముకడ బురహాన్‌నిజాముషా సైన్యములతో గలిసికొందు ననియు నచటినుండి యుద్ధసన్నాహములు జరుపవచ్చు నని రాయబారులకు బ్రత్యుత్తర మొసంగి వారలను బంపివేసి తనవాగ్దత్తము నెఱవేర్చుకొనుటకై తనసేనలను సమకూర్చుకొని దండయాత్ర సాగించి రాచూరుకడ నహమ్మదునగరసుల్తాను సైన్యములను గలిసికొని తాను రాచూరు, ముదిగల్లుదుర్గములను వశపఱచుకొనుటకును, షోళాపురము, కలుబరిగెదుర్గములను వశపఱచుకొనుటకై బురహానుకు దోడ్పడుటకు నేర్పాటు చేసి కొనియెను. ఉభయసైన్యములును రాచూరుదుర్గమును వశపఱచుకొన్న వెనువెంటనే ముదిగల్లుదుర్గముకూడ నెట్టియాటంకమును నిరోధమునుజూపకయె స్వాధీన మయ్యెను. రామరాయలు తనపిన్నతమ్ముని వేంకటాద్రిని నిజాముషాకు దోడ్పడనియమించి తానుమాత్రము విజయనగరమునకు మరలివచ్చెను. బురహాన్‌నిజాముషా వేంకటాద్రితోడ్పాటుతో గొలదికాలము షోళాపురమును వశపఱచుకొని యాదుర్గమును బలపఱచుకొని యహమ్మదునగరమునకు మరలిపోయెను. విజాపురసుల్తానులచరిత్రమును వ్రాయునపుడు ఫెరిస్తా కలుబరిగె సమాచారము నెత్తియుండలేదుగాని యహమ్మదునగరసుల్తా