పుట:Aliya Rama Rayalu.pdf/138

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చినవా డయినను, ఇబ్రహీము వెంటవేంకటాద్రి విజయనగరసైన్యములతో వెంబడించిపోయినను పానుగల్లుచేరినవెనుక 'మీర్‌జుమ్లా' యగు 'ముస్తఫాఖాన్‌' మూడువేల యాశ్వికసైన్యముతో 'సలాబత్‌ఖాను' వచ్చి కలిసికొనుటచేత హిందూసైన్యములసహాయముతో నింకనిమిత్తములే దనివేంకటాద్రిని వానిసైన్యములను వెనుకకు బంపివేసె ననిక్రొత్త యూహను గల్పించి వ్రాయుచున్నాడు. ఏవిధమైనయడ్డంకును లేకుండ ముస్తఫాఖాను కుండుజనరంజకత్వముచేత నిబ్రహీము పట్టాభిషిక్తు డయ్యెనట! [1]

అయినను భట్టుమూర్తి తన 'నరసభూపాలీయము' నందు

          "నతుని వర్ధితుని దత్సుతుని బట్టముం గట్టి
           కుతుపనమల్కన క్షోణి నిలిపె" అని

తనరక్షణకోరివచ్చినవాని సంరక్షించి కుతుపనమల్కను పట్టాభిషిక్తుని గావించె ననిచెప్పి యున్నాడు. ఈమహాకార్యము రామరాయలసౌశీల్యతను దెలుపుటయెగాక యాతడెంతటియుదారహృదయుడో తేటపఱుపక పోదు.

విజాపురసుల్తానుతో మఱియొకయుద్ధము విజయనగరము అహమ్మదునగరసుల్తానుతో జేరి విజాపురసుల్తానుపై గడపటిదండయాత్రసలిపినవెనుక శాంతి నెక్కొలుప బడియుండ లేదు. 1551 సంవత్సరాంతమున విజాపురసుల్తాను

  1. The Aravidu Dynasty of Vijayanagar, p. 83, 84, Note No. 1.