పుట:Aliya Rama Rayalu.pdf/131

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ముగిసినను పిమ్మట నొకప్పుడు రామరాయలచే బ్రేరేపింపబడి బురహాన్ నిజాముషాహ ఇబ్రహీమ్‌ఏదిల్‌షాపై దండెత్తిపోయి కలుబరగిదుర్గమును ముట్టడించియు జయింపలేక విజాపురసుల్తానుచే నోడింపబడి మరలి యహమ్మదు నగరమునకు వచ్చేసె ననియు, దక్కనుసుల్తాను లెప్పుడు నైకమత్యముతో నుండకుండునటుల చూచెడు రామరాయల తంత్రములు నెఱవేఱుచు వచ్చిన వనిఫెరిస్తా వ్రాయుచున్నాడు. తరువాత విజయనగర రాజ్యమునకును దక్కనుసుల్తానుల రాజ్యములకును 1549 వ సంవత్సరము వఱకును యుద్ధము లేవియు జరిగియున్నట్టు గానరాదు.

కళ్యాణి కలుబరగి దుర్గముల ముట్టడి

ఆసంవత్సరమున విజాపురమునందు బెల్గాముదుర్గాధిపతియును, సుల్తానుకార్యకర్తయు, సైన్యాధ్యక్షుడును వృద్ధసేనానియు నగు అసాదుఖాను మరణము జెందెను. ఈవార్త అహమ్మదు నగరమున దెలియగనే అహమ్మదు నగరసుల్తాను కుట్రప్రారంభించి తనపక్షమున నుండుటకై రామరాయల కడకు రాయబారులను బంపెను. ఈసుల్తానులలో నైకమత్యము లేకుండ జూచుటయే రాజనీతిగా బరిగణించుచున్నవా డగుటవలన సంతోషించి యతనితోడిమైత్రి కంగీకరించి యొడంబడిక గావించుకొనె నట. ఈసంగతి విజాపుర సుల్తానునకు దెలియవచ్చి యతడు తనయాస్థానమునం దున్నవిజయనగర