పుట:Aliya Rama Rayalu.pdf/121

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

డగా వీనిని విస్మరించి హీరాసుఫాదిరి ఫెరిస్తాను విశ్వసించి వ్రాయుట తెలుగుభాషనాత డెఱుగకుండుటయేకారణము. ఈగ్రంథకర్తలు కవు లయినపాపముచేత వీరుచెప్పిన సత్యాంశములనుగూడ ద్రోసిపుచ్చ నగునా? వర్ణనాంశములలో నతిశయోక్తు లుండిన నుండుగాక! వారుసమకాలికులై యుండి చెప్పినవిషయములను గూడ ద్రోసిపుచ్చ నగునా? ఆరవీటివంశచరిత్రము నందునెచ్చట సత్యచరిత్రాంశమునకు గౌరవము ముఖ్యముగా నీయదగియుండెనో యాగౌరవము నచటనుండి హీరాసుఫాదిరి తొలగించివేయుట మిక్కిలి శోచనీయము.

ఇట్లు సంధిచేసికొని విజాపురసుల్తాను దనరాజధాని జేరినకొలదికాలములోనే అహమ్మదునగరసుల్తా నగుబురహాన్ నిజాముషావలన నాహ్వానింప బడియతనితో గుట్రకావించి బీదరు, విజయనగరములపై దండయాత్రలుసాగించుటకు నిశ్చయించుకొని రట! ఆప్రకారము బురహాను బీదరురాజ్యముపై దండెత్తివచ్చెనట! బీదరుసుల్తా నగుబరీదుషాయీ సంధివిషయమెఱుంగక బరీదుషా తనపూర్వమిత్రు డగు ఇబ్రహీమ్‌ఆదిల్‌షాకడకు సహాయార్ధ మఱిగె నట! అతడు వెంటనే యాతని జెఱబెట్టె నట! ఆదిల్‌షా తరువాతవిజయనగరరాజ్యముపై దండెత్తి విజయముగాంచి విజయనగరరాజ్యములోని పెక్కుభాగములను తనరాజ్యములో గలుపుకొన్నాడని ఫెరిస్తావాక్యముల నుదాహరింపుచు హీరాసు విజయనగరరాజ్యములోని భాగములను కలుపుకొన్నదిమాత్ర మసత్య