పుట:Aliya Rama Rayalu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంత దక్కనుసుల్తానులు తమతమరాజ్యముల సంరక్షించుకొనవలయు నన్నయాతురముతో దమదమ సైన్యములతో విడిపోయి యెవరిమార్గముల వారుపలాయనులై పోవుచుండిరి. అళియరామరాయలు వారుపోయెడివిధమును గాంచి తనసైన్యములను మూడువిభాగములుగ జేసి తనసోదరులతో నొక్కొకభాగమున కాధిపత్యమువహించి తానుగోలకొండ సుల్తా నగుజమ్షీదుకుతుబ్షాను, తిరుమలరాయలు అహమ్మదు నగరసుల్తా నగుబురహాన్‌నిజాముషాను, వేంకటాద్రి విజాపురము బీదరుసుల్తానులగు ఇబ్రహీమ్‌ఆదిల్‌షా, అమీర్‌బరీదుషాలను వెంబడించిపోయి వారలను జయించివారలతో సంధిగావించు కొనవలయు ననినిశ్చయించుకొని వారలను వెంబడించి యడవులమార్గముల తఱుముకొని పోవుచుండిరి.

వేంకటాద్రి నవాబరీదుల యుద్ధము

నవాబరీదులను దఱుముకొనిపోవుచుండిన వేంకటాద్రి సైన్యములతో నాతని పెదతండ్రియు, వేద్ధుడును నౌకు దుర్గాధ్యక్షుడును నగుతిమ్మరాజును, వానిపుత్రులగు నప్పలరాజాదు లున్నట్టి బాలభాగవతమున వర్ణించిన విషయములను బట్టి గ్రహింప నగును. వీరిసైన్యములకును నవాబరీదుల సైన్యములకును ఆదవానికడ నొకయుద్ధమును, కూరకచెర్లకడ నొకయుద్ధమును, మానువకడ నొకయుద్ధమును జరిగినట్లుగ దెలియుచున్నది. సలకముతిమ్మయకు దోడ్పడ వచ్చినప్పుడే