పుట:Aliya Rama Rayalu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బిమ్మట బట్టాభిషిక్తుడుగా దగినహక్కుగలవాడు, చిన్నవేంకటాద్రికి బినతండ్రికుమారుడునగు సదాశివదేవరాయని బట్టాభిషిక్తుని గావించిన యళియరామరాయలు విప్లవకారకు డనిపించుకొనునా? సలకముతిమ్మయను సింహాసన భ్రష్టునిగా జేయుటకై యళియరామరాయలు విప్లవము కల్గించినా డని వ్రాయుట యెంతవిపరీతమైన విషయముగా నున్నది? అళియరామరాయలు సదాశివరాయనికి గలన్యాయ్య మైనహక్కు నిప్పించినవాడుగాని వానిసార్వభౌమునిగా నెన్నుకొని లేనిహక్కును గల్పించినవాడు గాడు.

కారణ మెవ్వరేవిధముగా వక్కాణించినను అళియరామరాయల సైన్యములకును, దక్కనుసుల్తానుల సైన్యములకును 1542 వ సంవత్సరమున బోరాటము ప్రారంభమైనసంగతి సత్యము. విజయనగరమున సదాశివరాయని బట్టాభిషిక్తుని గావించినవెనుక నళియరామరాయలు నగరరక్షణమునకు మూలసైన్యముగా గొంతవిజయనగరమున నిలిపి సార్వభౌముని రక్షణమునకుగా విశ్వాసపాత్రులయిన సేనానుల నియోగించి మఱికొంతసైన్యముతో దానుగూడ వెడలిపోయి దక్కను సుల్తానులజయించుటకై యిదివఱకే పంపబడిన తన సైన్యములదక్కనుసుల్తానుల సైన్యములతో దలపడియుద్ధము జేయుచుండ గలిసికొనియెను. విజయనగర సైన్యములకును దక్కనుసుల్తానుల సైన్యములకును ఘోరయుద్ధము జరిగినది. ఆకాలమున విజయనగరసామ్రాజ్య మలంకరించి ప్రఖ్యాతి