పుట:Aliya Rama Rayalu.pdf/108

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నగర రత్నసింహాసనముపై గూరుచుండ బెట్టి సకలసామంత సమేతముగా దనకుభృత్యుడనయి యుందుననిచెప్పి పాదాక్రాంతుడై యుండి యామహానగరమున నేడుదినములు మహోత్సవములు సలిపి, సకలసామ్రాజ్యము సమర్పించిన నాడదిమంచిసమయముగా దోచక విడిచివచ్చిన మహనీయునకు సకలసేనాసమన్వితుడై యళియరామరాయలు భీమార్జునులం బోలిన వీరసోదరద్వయముతో సలకముతిమ్మయసైన్యమునను జయించి, సమరంబున వానిజిక్కాడి, విద్యానగరమున బ్రవేశించి, సదాశివదేవరాయని బట్టాభిషిక్తుని గావించి, యజేయుడై తనకీర్తిని నల్గడల బ్రసరింప జేయుకాలము మంచిసమయముగా దోచి, యాదవాని దుర్గముపై దండయాత్ర సాగించనా డనిరామరాయలకు బ్రబలద్వేషియైన ఫెరిస్తా వ్రాసిన వ్రాయుగాక! నిష్పక్షపాతముగ నారవీటి వంశచరిత్రమును వ్రాయగడంగిన హీరాసుఫాదిరి వంటిచరిత్రకారుడు ఫెరిస్తాస్వభావము నెఱింగినవా డయ్యు నిట్లసంగతముగ జరిత్రము తలక్రిందుజేసి వ్రాయుట యత్యాశ్చర్యకరముగా నున్నది. అచ్యుత దేవరాయలకుమారుని బట్టాభిషిక్తు డయినవాని దనమేనల్లు డయినచిన్నవేంకటాద్రిని వాని పినతండ్రియగు రంగరాయని సంహరించి తానురాజ్య మాక్రమించుకొని సామ్రాజ్యమునకు శత్రువులగు వారిని జేరదీసి హిందూ సామ్రాజ్యమును భ్రష్టముగావింప దలపెట్టిన సలకముచిన్నతిమ్మరాజు విప్లవకారకు డనిపించు కొనునా? చిన్న వేంకటాద్రికి