పుట:Aliya Rama Rayalu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కావున వారుసత్య మిదియని నిర్థారించి వ్రాసినవ్రాతలు గావు. ఆరవీటివంశచరిత్రమును వ్రాసిన హీరాసుఫాదిరి తనగ్రంథములో విజయనగరమునకును మహమ్మదుమతస్థులకును పోరాటము సదాశివరాయని పరిపాలనాప్రారంభకాలమున దాదాపుగా నతనిపట్టాభిషేకదినముననే ప్రారంభ మయ్యె ననివ్రాయుచు, "రాజ్యమాక్రమించుకొన్న సలకము తిమ్మయను సింహాసనమునుండి తొలగించుటకై విజయనగరమునందు సంభవించిన విప్లవమును, తరువాత విజయనగరచక్రవర్తిగా సదాశివరాయని నెన్నుకొనుటయు విన్నవాడై యయ్యది తనకు మంచిసమయ మనియోజించి విజాపురసుల్తానగు ఇబ్రహీమ్‌ఆదిల్‌షా ప్రాముఖ్యత గాంచినయాదవానిదుర్గమును స్వాధీనపఱచుకొనుటకై అసాదుఖానుని నియోగించి వానిసైన్యములో నధికభాగము వానిపరముచేసె" నని ఫెరిస్తా వ్రాసినవాక్యముల నుదాహరించి యున్నాడు.[1] ఇయ్యది షడ్రసోపేతమైన భోజనము భుజింపుమని సమస్తమధుర పదార్థములతో గూడినవిస్తరిని గృహయజమాని తనముంగట నుంచగా గాలదన్ని వీథిలోనికి గిరవాటు వేసినవిస్తళ్లలోని యెంగిలినాకుటకు బఱుగిడినబిచ్చగాని కథను జ్ఞప్తికి దెచ్చుచున్నది. అళియరామరాయలు సోదరద్వయముతో విజయనగరము నుండి పాఱిపోయియున్నప్పుడు సలకముతిమ్మయ తన్నాహ్వానించి విద్యానగరమునకు రప్పించి లక్షలకొలది హొన్నులద్రవ్యమును సమర్పించుకొని విజయ


(1) The Aravidu Dynasty of Vijayanagar. p.74

  1. The Aravidu Dynasty of vijiayanagar, p. 74.