పుట:Aliya Rama Rayalu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారిలోమిగిలినవా డితడొక్కడే యగుటచేతను, మేదాశక్తియు రాజ్యతంత్రజ్ఞానము నతిశయించినవా డగుటచేతను, అళియరామరాయ లీరీతిగా సదాశివరాయలను దగ్గిరకు జేరదీసి తొలుత తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి సాన్నిధ్యమున బట్టాభిషేకము జరిగించియు రెండవమారు సామ్రాజ్య రాజధానియగు విద్యానగరమున సకలరాజ సమక్షమున యధోచిత విధానమున బట్టాభిషేక మహోత్సవమును గావించెను.

ఈపట్టాభిషేకమహోత్సవ మేనాడు జరిగినదియు దెలియ దగుప్రమాణమేదియు నింతవఱకు మనకు లభింపకపోయినను క్రీ. శ. 1542 వ సంవత్సరములో ప్రథమభాగమున జరిగియుండు ననినిశ్చయింప వచ్చును. ఎందుకన, 1542 వ సంవత్సరము జూలై 27 వ తేది గలయొక శాసనము సదాశివదేవరాయలపేరుతో గన్పట్టుచున్నందున నంతకు బూర్వమెపట్టా