పుట:Aliya Rama Rayalu.pdf/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దిగా నాజ్ఞ నిచ్చి సంతుష్టాంతరంగు డగుచు గాలయాపనముసేయక యొకశుభముహూర్తమున బాలుడయినసదాశివదేవరాయని విద్యానగరరత్నసింహాసనముపై గూరుచుండ బెట్టి మహావైభవముతో సకలసామంతమంత్రి పురోహితవిద్వజ్జనబంధుజన సమక్షమున బట్టాభిషేకము గావించి తానుకార్యకర్తగా నుండి వీరప్రతాపకఠారి సాళువవీరసదాశివరాయదేవరాయ మహారాయలే సామ్రాజ్యసార్వభౌము డనిప్రకటించి మున్ముందువిధేయ ప్రణామంబులాచరించి శ్వేతచ్ఛత్రమును బట్టుకొనియెను. తమసమ్మతమునుజూపుచు మహామండలేశ్వరులయిన సామంతనృపతు లెల్లరును మహానందముతో విధేయులై కృతప్రణాము లయిరి. సదాశివదేవరాయ లిదివఱకు విజయనగరసామ్రాజ్యమును బరిపాలించి ప్రఖ్యాతులైన కృష్ణదేవరాయలకును, అచ్యుతదేవరాయలకును తమ్ముడైనరంగరాయలకు తిమ్మాంబయందుజనించినపుత్త్రుడు. అళియరామరాయల పెదతమ్ము డైనతిరుమలరాజునకు భార్య యైనవెంగళాంబకు దమ్ముడు[1] సామ్రాజ్యసింహాసన మధిరోహింప నర్హులయిన

  1. ఈవెంగళాంబ కృష్ణదేవరాయలకు చిన్నాదేవియందు బుట్టిన కూతు రని 'హండే అనంతపురచరిత్ర' మను నొకస్థానికచరిత్రమునందు దెలుపబడి యుండెను గాని, బాలభాగవతమునగాని, వసుచరిత్రమున గాని, నరపతివిజయము నందుగాని మరియెచ్చటను దెలుపబడి యుండ లేదు. అళియరామరాయలను కృష్ణదేవరాయని యల్లుడని వ్రాసినవారిదివాస్తవ మయినయెడ తిరుమలరాయనిగూడ నతనియల్లుడనియె వ్రాసియుందురు. సదాశివరాయల సోదరియగు వెంగళాంబను అళియరామరాయల తమ్ముడు తిరుమలరాయలు వివాహమైనట్టు హంపీక్షేత్రమునందలి చండేశ్వరీదేవాలయమునందలి యొకశాసనమువలన దెలియవచ్చుచున్నది. కృష్ణదేవరాయనికూతురైనను, అతనితమ్ముడు రంగరాయలకూతురైనను సదాశివదేవరాయల సోదరియని చెప్పవచ్చును. ఎట్లయినను నీయిర్వురును పూర్వరాజకుటుంబమున కల్లుండ్రని విశ్వసింపదగును. (See A. D. V. p. 22 Notes 6 and 7)