పుట:Aliya Rama Rayalu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూఁడవ ప్రకరణము

సదాశివరాయల పట్టాభిషేకము

ఎంతబలవంతుడయ్యును దుష్ర్పతాపమువలన విగత విభవుం డగుట నిశ్చయము. రాజ్యలక్ష్మి వివేకవిహీనుల జిరకాలము నాశ్రయించి యుండదని పెద్దలునుడివెడుమాటయు సత్యము. ఇట్లవివేకియు, దుష్ర్పతాపమువలన మదోన్మత్తుడయినద్రోహియు నగునాసలకముచినతిమ్మరాజు, ఆయతభుజవీర్యులును, మహాయోధులును, అనిర్జేయులును, పరస్పరస్నేహాయత్తచిత్తులును, మహాసేనాన్వితులు నగునాయారవీటిసోదర త్రయమును బ్రతిఘటించి ఘోరసంగ్రామముసలిపియు నిలువ జాలక వెన్నిచ్చి పాఱి శిరచ్ఛేదనము గావింపబడిన సమాచారము విన్నమీదట దక్కనుసుల్తానులు యుద్ధరంగము నుండి తొలగి పోయిరి. అంత:పురమున నున్నకృష్ణదేవరాయలవారిరాణు లీవార్త వినివిద్యానగరద్వారములను దెఱువ నాజ్ఞాపించిరి. అళియరామరాయ లేయడ్డంకునులేక విద్యానగర ప్రవేశము గావించి యంతటితో దృప్తిజెందక దక్కను సుల్తానులవలన నెట్టియుపద్రవమును మరల గలుగకుండుటకై తగుసేనానులకు వలసినంతసైన్యము నొసంగివారలను దఱుముకొనిపోయి పోరాడి జయించి వశ్యులను గావించుకొనవలసిన