పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

అక్కన్న మాదన్నల చరిత్ర

చుండెను. ప్రస్తుతము గోలకొండలోనుండిన పరిస్థితులప్రకారము ఈకార్యము తత్క్షణమే సాధ్యముకాదు. అన్నిలక్షలు వెంటనే ఎట్లుదొరకును? రెండవది అక్కన్నమాదన్నలను ఎట్లు తొలఁగించుట? తానాషాహృదయము వారియెడ కృతజ్ఞతా జడమైయుండెను. తమశరీరములు వేఱుగాని హృదయము లొకటేయని ఆమంత్రులును ఆసుల్తానును తలంచియుండిరి. వారియం దేమిదోషము? తానాషా వేదాంతి. రాచకార్యములకును మతమునకు సంబంధము ఆతనికి గోచరింపలేదు. పైగా కుతుబుషాహి (గోలకొండ) రాజ్యములో మహమ్మదీయేతరులు మంత్రులుగా నుండియున్నారు. వారికి రాజభక్తియు దేశభక్తియు లేకపోలేదు. ఇంతవఱకు ద్రోహమొనర్చిన వారందఱు మహమ్మదీయులే. ఈ హిందువులే సుల్తానును వదలక యున్నారు.

అక్కన్న మాదన్నలు సుల్తానును సమీపించిరి. ఆతఁడు పాదుషా రాయబారములోని ఈవాక్యములను వారికి వినిపింప లేదు. కాని ఆమహాత్ముని హృదయమును వారు గ్రహించిరి. వెంటనే తానాషా పాదములకు సాష్టాంగముగా మ్రొక్కి “మహాత్మా, మేము హిందువులము, బ్రాహణోత్తములము. మాగురువులకుతప్ప నమస్కరింపము. తాము మహమ్మదీయు లైనను భగవత్స్వరూపులు. మీవంటి వేదాంతియు పండితుఁడును మా యాంధ్రదేశమును ఎన్నఁడును పాలించియుండఁడని తలంచుచున్నాము, మీగురువులు జగద్గురువులేగాని వేఱు