పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౪ - మాదన్న మీఁద రెండవకుట్ర

75

లక్షమందిబ్రాహ్మణులకు అన్నదానములకు ఏర్పాటుచేయించిరి. ఇంకను పారలౌకిక కార్యములు చేయుటకు కాలము వచ్చినదని వారు తలంచిరి. తల్లిదండ్రుల కపాయమురానీయక వారిని తమ్ములతో దూరదేశములకు పంపివేసిరిగదా. ఇది మొదలు తమ జీవితమంతయు భగవత్కైంకర్యమున గడుప మొదలిడిరి. శ్రీశైల గర్భాలయమునకు బంగారుపూఁత పూయించిరి. పుష్పగిరి శంకరాచార్యపీఠమునకు భూదానము లిచ్చిరి. గోలకొండకు సమీపమున మహేశ్వర మనుచోట శివాలయమునకు ఒక వారములో నొక మహోన్నతగోపురమును నిర్మించిరి. అచటనే యొకతటాకమును త్రవ్వించి, ఆలయగోపురమునకు కలశాది ప్రతిష్ఠలుచేసి, పూజారులను హెచ్చుగా నేర్పాటుచేయించి ప్రతిదినము రెండువేలమంది బ్రాహ్మణులకు అన్నదానముచేయుటకు ప్రారంభించిరి. ఎన్ని రాచకార్యము లుండినను ప్రతిదినమును ఉదయము పండ్రెండుగంటలకును, రాత్రి పదిగంటలకును అచ్చటికేఁగి స్వయముగ బ్రాహ్మణసమారాధనలో పాల్గొని వచ్చుచుండిరి.

ఇట్లు వీరు కైంకర్యమున నుండఁగా శత్రువులు సుల్తాను సాయములేకయే వీరిని చంపివేసినయెడల చాలబాధలు పోవునని తలంచిరి. అంతఃపుర పూర్వసువాసినులు వీరికి సాయపడు చుండిరి. వీరందఱునుకలసి కుట్ర సాగించిరి. సుల్తానుకడనుండి మంత్రులు ఒంటరిగా వెడలిపోవు సమయము చూచి వారిని చంపివేయవలసినదని తమపరివారములతో సమయము వేచి