పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

అక్కన్న మాదన్నల చరిత్ర

అక్కన్నమాదన్నలు పాదుషాకువ్రాసి దానిని ఒకనిచేతి కీయఁగా వానిని ఎవరో పట్టుకొనివచ్చినట్లు సుల్తానుకడకు తెచ్చిరి. తానాషా ఆజాబు చూచుకొనెను. మాదన్న వ్రాఁతవలెనే అది యుండెను. కాని సుల్తాను మనుష్యుల అంతర వెుఱిఁగినవాఁడు. ఈజాబును పట్టుకొనినవారు మాదన్నకు స్నేహితులు కారు. ఆతనివ్రాఁతకును దీనికి కొంతభేదము నుండెను. వెంటనే అక్కన్న మాదన్నలను సుల్తాను పిలిపించెను. వారును వచ్చిరి. ఆజాబు వారిచేత నిడెను. వారిరువురును దానినిచూచిరి. వారి మొగములయందు ఎప్పటిప్రసన్నత యుండెనేగాని అవి దొంగ మొగములుగా లేవు. తమవ్రాఁతగల మఱియొకకాగితమును చూపి పోల్చుకొమ్మని వారు ప్రభువును కోరిరి. కొన్నియక్షరములలోను భాషలోను భేద ముండెను. ఈజాబు వాస్తవముగా తమదేయని ప్రభువు నమ్మియుండినయెడల తా మెట్టిశిక్షకైన తలయొగ్గియున్నటులు మంత్రులు ప్రమాణ మొనర్చిరి. తానాషా వెంటనే ఆజాబును చింపివేసెను. అంతసేపును అట్టె చూచుచుండి షేక్‌మిౝహాజ్ అత్తిమత్తులు మత్తులవలెనై వెడలిపోయిరి. తానాషా తనకు కష్టకాలము సంప్రాప్తమై యున్నదని తలఁచి తనమంత్రులమీఁది యీప్రయోగములు ఎట్లు పరిణమించునోయని చింతింపసాగెను.

సుల్తాను సెలవునంది ఇంటికి వచ్చుచునే భగవంతునిపై భారమువేసి అక్కన్న మాదన్నలు తమగుమాస్తాలను పిలిపించిరి. కాశీమొదలు రామేశ్వరమువఱకు పుణ్యక్షేత్రములలో