పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౪ - మాదన్న మీఁద రెండవకుట్ర

73

నవి. ఎంతకొల్ల పోయినదో! పాదుషాకుమారుఁడు పశ్చాత్తాప పడసాగెను. అతనిది మెత్తనిహృదయము; పాదుషావంటి కర్కశుఁడుగాఁడు. ఏమైనను తానాషా మహమ్మదీయుఁడేగదా యని తలఁచి ఒకకోటియు నిరువదిలక్షలహొన్నుల కప్పము సంవత్సర మొకటింటికి తానాషా కట్టుట కొప్పుకొనునెడల తాను పాదుషాతోచెప్పి మన్నన యిప్పింతుననెను.




ప్రకరణము ౧౪ - మాదన్నమీఁద రెండవకుట్ర

అత్తిమత్తరాయని మొదటిప్రయోగము ఫలింపలేదు. సుల్తానునకు మంత్రులపై నభిమాన ముండువఱకు వారిబలము తగ్గుట కవకాశములేదు. ఈమాఱు మఱియొకవిధమైనప్రయోగము లేవనెత్తెను. మొగలాయీలువచ్చి చెంతనే యున్నారు. దినదినమును ఏదో క్రొత్త ఆశ్చర్యకరమైన విశేష మొకటి జరుగుచునే యుండెను. మీర్‌ఇబ్రహీం మొగలాయీలకడకు పోయినదిమొదలు ఎవఁడో యొకఁడు ప్రతిదినము ఆపనియే చేయుచుండెను. సర్దారులు చాలమంది పాఱిపోయిరి. ఒకదినము సుల్తాను చాలఖిన్నుఁడై యుండెను, షారఫ్ ఉల్-ముల్క్ అను నతఁడు, ఆతని చెల్లెలి భర్తయే, మొగలాయీలకడకు పాఱిపోయెను. ఈసందర్భమున ఆదిత్యమూర్తియు షేక్‌మిౝహాజును కలసి ఒక దొంగజాబును పుట్టించిరి. ఔరంగజేబు స్వయముగా వచ్చినయెడల తాము తానాషాను పట్టియిచ్చి గోలకొండ కోటను ఆతనికి స్వాధీనము చేయుటకు సిద్ధముగా నున్నామని