పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౩ - కుట్రలు, కుయుక్తులు

69

గట్టిగా చెప్పజాలకున్నాననియు విషయము చక్కఁగా తెలిసికొనవలసి యున్నదనియు కాని అట్లుండదనియు బదులిడెను.

గోలకొండలో మీర్ మహమ్మదును అంతఃపురములోని వారును వీరితోచేరినవారును ‘తానాషాసుల్తానును మాదన్నయు కలసి ఇబ్రహీమును ఖైదు చేయనున్నారు’ అని ప్రవాద పుట్టించిరి. ఈమాటలు స్కంధావారమున ఇబ్రహీం చెవిలో పడెను. ఇందులకు దోహదముగా కూడనుండి స్నేహము నటించుచుండిన మిౝహాజు అతనికి అపాయము తప్పదనియు వెంటనే మొగలాయీలకడకు పాఱిపొమ్మనియు తానును శీఘ్రముగ వెనుకవచ్చునట్లును నమ్మించెను. లోకులను మోసముచేయుటకు ప్రత్యక్షముగా నిరువురును ఒకదినము జగడమాడి తటాలున ఆకారణముచేత వెడలిపోయినట్లు ఇబ్రహీము మొగలాయీల కడకు పాఱిపోయెను. అతనిని వారు గౌరవించి ఆఱువేలసైన్యమునకు మన్సబ్దారుగా నియమించి మహబత్‌ఖానను బిరుదమిచ్చిరి.

ఇబ్రహీము పాఱిపోయెనని తెలిసినంతనే మాదన్న మీఁద నాతనిశత్రువులు చాడీలు చెప్ప నారంభించిరి. శత్రుపక్షమునచేరిన మీర్ ఇబ్రహీం మాదన్నకు ఆశ్రితుఁడనియు, ఆతఁడు వంచనచేయఁబోవుట మాదన్నకు ముందుగానే తెలియుననియు, అందుచేతనే ఆనాఁడు తెలిసియు, ఇంకను విచారించుట మంచిదని పల్కెననియు, ఇంక త్వరలోనే మాదన్నయు గోలకొండవారిని మోసముచేసి శత్రువులతో చేరుననియు షేక్