పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

అక్కన్న మాదన్నల చరిత్ర

మిౝహాజ్ ఏకారణముచేతనో అక్కన్నతో వైరమూనియుండెను. మొదటినుండియు అంతఃపురమందలి స్త్రీలకు అక్కన్న మాదన్నలన్న ద్వేషమే. అబ్దుల్లాసుల్తానుభార్యలైన సరోమా జనీసాహెబులకు తానాషామీఁద మొదటనేర్పడిన ద్వేషము ఆతనిమంత్రులమీఁదికి ప్రసరించెను. వీరికి ఈ హిందువులను తొలఁగించి మహమ్మదీయులను మంత్రులుగా నియమించుకొన వలయునను కోర్కెయుండెను.

స్కంథావారమునుండి ప్రతిదినము యుద్ధ మొనరించు చుండిన షేక్‌మిన్హాజునకును నగరిలోనుండు అత్తిమత్తరాయనికిని ఆ పూర్వసువాసినులైన పూర్వరాణులకును ఉత్తరప్రత్యుత్తరములు జరుగుచుండినవి. మీర్ ఇబ్రహీం అను వానిని మొగలాయీలు తమవైపు లాగుటకు ప్రయత్నించుచుండిరి. షేక్‌మిౝహాజ్‌కూడ మొగలాయీలతో చేరుటకు యత్నించుచు ఆవిషయమును పైకితెలియనీయక మెలఁగుచుండెను. రహస్యముగా గోలకొండకు చారులనుపంపి ప్రతిదినము సాయంకాల మగుసరికి గోలకొండఫౌజు ఓడిపోవుటకు కారణము ఇబ్రహీము కార్యశ్రద్ధ వహింపకపోవుటయే యని తానాషాయును మంత్రులును తలంచునట్లు చేయుచుండెను. అట్లే ప్రచారమగుచుండెను. మీరుమహమ్మదు తనమాటలలో, మీర్‌ఇబ్రహీం మొగలాయీలకు అనుకూలుఁ డనునట్లు చెప్పుచుండెను. సుల్తాను మాదన్నను పిలిపించి ఇట్లుండునా యని యడిగెను. మాదన్నకు ఇందు సత్యముతెలియనందున తానేమియు