పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

అక్కన్న మాదన్నల చరిత్ర


కాపున్నటువంటి ఖానీజహాను అనువానిని రాజకుమారునితో కలసికొనవలసినదని ఆజ్ఞాపించెను. ఈ వ్యూహముచేత బిజాపురమును ముట్టడించు బలములుతగ్గినను తానాషాను దండించుటకు పాదుషా తనసైన్యమును విడదీసెను.

మొగలాయీసైన్యములు భీమానదీతీరమున ఆగ్నేయముగా నడచినవి. గుల్బర్గా షోలాపూరులనడిమి డెబ్బదిమైళ్లు మొగలాయీల స్వాధీనమున నున్నందున సులువుగా నడక సాగెను. తర్వాత మందగించెను. ముందుపోవుసైన్యమును నడపుచు ఖానీజహాను మాల్ఖేడుకోటను సమీపించెను. రాజకుమారుఁడు మూఁడు నాలుగుప్రయాణములు వెనుకఁబడి వచ్చుచుండెను. రెండుసైన్యములకును నడుమ 25 మైళ్ల దూరముండెను. సేనా ముఖరక్షకముగా నొకసైన్యమును నడుపుచు జాౝనిసార్‌ఖాౝ అను నతఁడు ముందుపోవుచుండెను. ఈసైన్యము మాన్యఖేటమునకు తూర్పుగా ఎనిమిదిమైళ్లదూరముననుండు ‘సెడం’ అను ప్రదేశమునకు రాఁగానే గోలకొండవారిసైన్యము, (నలుబదివేలు మొదలు డెబ్బదివేలవఱకు నుండవచ్చును) మొగలాయీలను ఎదుర్కొనెను. గోలకొండవారి సేనాపతులు మీర్‌మహమ్మద్ ఇబ్రహీం, షేక్‌మిౝహాజ్, మాదన్నపంతులుగారి మేనల్లుఁడు రూస్తంరావు అనువారలు. గోలకొండవారి గుఱ్ఱపు దళము మొగలాయీవారిని చుట్టవేసికొనినది. అతికష్టము మీఁద పోరాడి మొగలాయిలు దీనిని జయించినను వారిపురోగమనము భంగమైనది. జాౝనిసార్‌ఖాను మాన్యఖేటమునకు