పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

అక్కన్న మాదన్నల చరిత్ర

‘మాదన్నా నేను మీయింట అడుగుపెట్టి పదునొకండుసంవత్సరములు. ఇక నొకసంవత్సరము పూర్తియగులోపలనే నేను మిమ్మువిడిచి పోవుచున్నాను.’ అని దేవిచెప్పినది. మాదన్న మేలుకొనెను. ఆనిముసమందే అక్కనయు అదేస్వప్నముఁగని మేల్కనెను. సోదరు లిరువురును కలియఁబలికికొనిరి. మాదన్న వెంటనే ఇట్లనెను. ‘అన్నా, తెలిసిపోయినది. మన భాగ్యదేవత మనలను వదలిపోవుదినములు వచ్చినవి. అందుచేతనే మన బుద్ధులు ఆవిధముగా మాఱినవి. కానీ, దైవగతి.’ తర్వాత వారిరువురును నిదురపోక ఉదయము తలిదండ్రులకు ఈవిషయమును తెలిపిరి. తండ్రి ‘భగవదాయత్తము’ అనెను. నాఁడు అందఱును కలసి గ్రహశాంతులుచేసి దానధర్మములు చేసిరి.

మాదన్న తనపదవికి అంతము సమీపించుచున్నదని నిశ్చయించుకొనెను. ఇఁకను మిగిలియుండు నీకాలమును సద్వినియోగము చేయనెంచెను. భావికాలమునకు జాగరూకత వహించుటగా, కోయిలకొండ, హసనాబాదు, రాజగోపాల పేట అనుమూఁడుఫర్గణాలను తనసోదరులు విశ్వనాథ మృత్యుంజయులకును తన తల్లిదండ్రులకును ఇప్పించెను. వెంటనే వారిని గోలకొండనుండి పదిలముగానుండు ప్రదేశములకు పంపెను. తనబంధువుల కనేకులకు భూదానములు చేసెను.

ఆదినము అక్కన్న తనపల్లకి నాశనముచేసినదిమొదలు అత్తిమత్తరావు (ఆదిత్యమూర్తిరావు) అక్కన్న మాదన్నల మీఁద గంటు వహించియుండెను. మాదన్న ఇదిగ్రహించి, ఆ