పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౧ - పాదుషా ప్రయత్నములు

61

సకలవృత్తాంతమును రహస్యనివేదకుల మూలమున గ్రహించు చుండెసు. పాదుషాకు ఎవరియందును నమ్మకములేదు, తన కొమారులనే నమ్మఁడు. తనరాయబారిమీఁద ఈనివేదకుఁడు వేగు. రాయబారికి ఈతఁడన్న హడలు, ఏమివ్రాయునో తన్ను గుఱించియన్న భయము. పాదుషాకు వేగులపై వేగులుండిరి. అట్టివానికి కోపమువచ్చినయెడల అది ఎంత ప్రమాదకరమో ఊహింప శక్యమా! ఆతని శాంతింపఁజేయుటకు మాదన్న చాల ప్రయత్నించెను. ‘ఆ! ఆ! ఎంతపని! ఎంతపని! ఎవరురా ఈపని చేసినవారు’ అని బంట్లనుతఱిమి, అన్ననుచూచి ‘ఏమన్నయ్యా, ఈవిధముగా జరిగినది. వీరిని నీవు చూడలేదా?’ అని అనుచునే ఆయనను చాలమర్యాదగా లోనికి కొనివచ్చి చాలక్షమాపణ కోరుచు, మర్యాదచేయించెను. అక్కన్న తమ్మునిభావము గ్రహించి, ఇది సిబ్బందిదోషమనియు, తనకు తెలియకపోయిన దనియు చెప్పి తానును మన్ననకోరెను. అత్తిమత్తరాయఁడు ‘ఏమియు పరవాలేదు’ అనెనేగాని ఆతనిహృదయమున క్రోధానలము ప్రజ్జ్వలించుట మాదన్న చూడకపోలేదు. మెల్లగా మర్యాదలతో తమపల్లకీలో కూర్చుండఁబెట్టి సాగనంపెను.

ఈగందరగోళమైన నాటిరాత్రి మాదన్నకు చాలసేపు నిదురరాలేదు. ఉదయమున జరిగినదానినే చాలసేపు తలపోయుచు అక్కన్న తొందరపాటునకు చింతించుచు ఇందేదో అనిష్టమున్నదని భయపడుచుండెను. సగమురాత్రి గడచినతర్వాత ఆతనికి నిదురపట్టినది. స్వప్నమున మహాలక్ష్మి దర్శనమిచ్చినది.