పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

అక్కన్న మాదన్నల చరిత్ర

తత్క్షణమే సిద్దిమసూదు శివాజీని సహాయము కోరెను. శివాజి వెంటనే ఆఱు ఏడువేల గుఱ్ఱపుదండును బిజాపుర రక్షణకు పంపెను. కాని మసూదునకు మహారాష్ట్రులయందు నమ్మకము తగ్గసాగెను. మహారాష్ట్రులు కొంతవఱకు స్నేహముగానేయుండి తమద్రోహబుద్ధిని చూపఁగానే మసూదు వారిని దూరమందుంచెను. వెంటనే శివాజియాజ్ఞచే వారు దోఁచుటకు ప్రారంభించిరిగాని తుపాకిదెబ్బకు వారినాయకుఁ డొకఁడు చచ్చుటచే వారు వెంటనే పాఱిపోయిరి. బిజాపూరువారు మొగలాయీలతో సంధి చేసికొనిరి.

మొగలాయీలు ఊరుకొనలేదు. మరల 1679 లో వారు బిజాపూరుమీఁదికి దండెత్తిరి. సిద్దిమసూదు మరల శివాజీనే ప్రార్థించెను. శివాజీ సహాయము పంపెను. మొగలాయీలు పట్టువదలక ఆక్రమించుచు బిజాపురమును మెల్లమెల్లగా సమీపించుచుండిరి. కాని శివాజీసాయముచేతను బిజాపూరువారి మొండిపట్టుచేతను మొగలాయీలకు విజయము కలుగలేదు. తర్వాత శివాజీ ఎక్కువ కాలము బ్రదుకలేదు. సయ్యద్‌జాౝ మహమ్మద్ అను సన్న్యాసియొక్క శాపముచేతనో లేక ఆయుర్దాయము లేనందువలననో శివాజీ 1680 ఏప్రిలు 5, ఆదివారమునాఁడు మరణించెను. తర్వాత శంభుజీ రాజారాములకు రాజ్యముకై స్పర్ధకలిగి తుదకు శంభువు 1680 సం॥ జూలైనెల రాజాయెను గాని 16 జనవరి 1681లోనే ఆతనికి పట్టాభిషేకము జరిగినది. ఈ కాలమునకు సరిగా మొగలాయీలకు రాజపుత్రు