పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౦ - ఆశాభంగము

49

బాదులోని ప్రభువులందఱును ఆదినము శివాజికిని ఆతనిబృందమునకును విందొనర్చిరి. విందైనవెంటనే తానాషాకు మహారాష్ట్రవీరుల శౌర్య బలాదికములను చూపనెంచి శివాజి యశాజికంకు అనువానిని ఏనుఁగుతో పోరాడుమనెను. గోలకొండవారి ఏనుఁగులలోని యుత్తమ మత్తేభమును తానాషా తెప్పించెను. ఆవీరుఁడు కత్తితో నాయేనుఁగుతో కొన్నిగంటలు పోరి దానికి రోషముపుట్టించి తుదకు దానితొండమును నఱికి తఱుమఁగొట్టెను.

తానాషా—శివాజి అన్నగారూ, మీయొద్ద ఎన్ని గొప్ప ఏనుఁగులు ఉన్నవి?

శివాజి – తానాషాసుల్తాౝభాయి వీరందఱును మా యేనుఁగులే.

అని తనవీరులనుచూపి సుల్తానును నవ్వించెను.




ప్రకరణము ౧౦ ఆశాభంగము

శివాజి గోలకొండనుండి వెడలిపోయెను. వెంటనే ఈ విషయమంతయు మొగలాయీవారికి తెలిసిపోయెను. ఔరంగజేబు చాలమండిపడి బహదుర్‌షా అనువానిని అధికారమునుండి తొలఁగించి అతనిస్థానమున దిలిరుఖాననువానిని నియమించెను. దిలిర్‌ఖాను గోలకొండమీఁదికి దాడివెడలెను. మాన్యఖేటము కడ (మాల్‌ఖేడ్) గోలకొండవారి సైన్యము మొగలాయీ

4