పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౭ - శివాజీ

35

శివాజీ తనకు గ్రహింపవలసినది–ఇట్లు నిబంధనలు కుదుర్చుటకు మాదన్న ప్రయత్నింపసాగెను.

శహాజీ చనిపోవునప్పుడు వెంకాజీ బాలుఁడు. ప్రపంచానుభవము చాలని తనకుమారునికి సాయముగా రఘునాథనారాయణహనుమంతె అనువానిని ఏర్పాటుచేసి శహాజీ మరణించెను. ఇంతకాలము ఈ హనుమంతె తానేప్రభువైనట్లు ఎల్లకార్యములను జరుపుచుండెను. వెంకాజీ నేఁడు పెద్దవాఁడు; హనుమంతుని పెత్తనమును సహింపలేకపోయెను. పైగా హనుమంతె నానామాయోపాయములచేత విస్తారము ధన మార్జించియుండెను. వెంకాజీ హనుమంతుని పాతలెక్క లడిగెను. హనుమంతె వెంటనే తనయుద్యోగమునకు రాజీనామా నిచ్చి కాశీయాత్రకు పోవునట్లు నటించి తన ఆస్తినంతయు తీసికొని జనార్దనుఁడను తమ్మునితోకూడ బయలుదేరెను. తంజాపురినుండి బిజాపురమునకు పోయెను. అచ్చట తనసామర్థ్యముచే నొక మంత్రిపదవి సంపాదించెను. ఇంతలో శివాజీ ఇతనిని తనకడకు పిలిపించెను. హనుమంతె పూనానగరమునకు పోయిచేరెను.

వెంకాజీమీఁద పగ తీర్చుకొనవలయునని హనుమంతె తలఁచియుండెను. అందులకై శివాజీని దక్షిణదేశముపై దండెత్తుమని హనుమంతె పురికొల్పుచుండెను. శివాజీకి తమ్ముని రాజ్యముమీఁద ఇంతవఱకు అపేక్షలేదుగాని హనుమంతుని దుర్బోధవలన ఇప్పడు ఏర్పడసాగెను. ఈకాలమునకు సరిగా రాజకీయపరిస్థితి శివాజీకి అనుకూలమాయెను. మొగలాయీ