పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

అక్కన్న మాదన్నల చరిత్ర

తండ్రివలెనే ఆడిల్‌షాక్రింది సర్దారుగా నీప్రదేశములను పాలించుచుండెను. ఇతనికి జింజిప్రాంతభాగము తండ్రివలన వచ్చినట్టిది.

ఈలోపున మధురనాయకులకును తంజావూరి ప్రభువులకును స్పర్ధలువచ్చి తంజాపురిపాలకుని మధురవారు చంపివేసిరి. గతించినరాజుయొక్క కొమారుఁడు బిజాపూరు ఆడిల్‌షాకు మొఱపెట్టుకొనఁగా నాతఁడు వెంకాజీని సాయము పొమ్మనెను. వెంకాజీ తంజావూరిని జయించి మధురవారిని పాఱద్రోలి ఆరాజ్యమును తానేహరించెను; చుట్టునున్న వారినికూడ జయింప యత్నించుచుండెను. ఈనడుమ క్రీ. శ. 1675 సం, ఏప్రిలునెలలో శివాజీసైనికులు బిజాపురభూములలో కొల్లగొట్టుచు గోలకొండ రాజ్యములోనికి ప్రవేశించి ఏతగిరి (నేటి యాద్గీర్)ని పూర్తిగా దోచుకొని హైదరాబాదువఱకును వచ్చి వెడలిపోయిరి.

మాదన్నమహామంత్రి ఆలోచించెను. విజయాపురమందలి దక్షిణప్రదేశములను జయించి ఆంధ్రసామ్రాజ్యమున చేర్పఁదలంచెను. ఇట్టిసందర్భమున శివాజీతో సంధి కుదుర్చుకొని అతనితోచేరి దక్షిణదేశమును జయించి పంచుకొనుట మంచిదని ఆతనికి తోఁచినది. వెంటనే శివాజీతో సంధికి తానీషాను అతఁడు ఒడంబరుపసాగెను–బిజాపురములోని కర్ణాటక దేశమును తానాషాగారికొఱకు శివాజీ జయించి ఇచ్చివేయవలసినది; దండయాత్రాకాలమున దొరకిన లూటీనంతయు