పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౭ - శివాజీ

33

దేశమున నేటి మదరాసుతీరము సుభిక్షముగా నుండుటయే గాక శివాజీ కంట నింకనుపడలేదు. ఈదేశమందలి జనులు నిరాడంబరజీవులై సౌఖ్యముగ నుండిరి. ఇచ్చటి రేవుపట్టణములు అతిప్రాచీనకాలమునుండియు విశేషవ్యాపారముల కాటపట్టు లగుటయేగాక ఇచటిగనులు తఱుగని సౌభాగ్యముగా నుండినవి. ఈ ధనమంతయు చాలవఱకు దేవాలయములకును ధర్మకార్యములకును ఖర్చగుటయేగాక విశేషముగా జనులకు దాఁచుకొనుటకును ఆభరణములు చేయించుకొనుటకును మిగులుచుండెను.

విజయనగరసామ్రాజ్యము పడిపోయినతర్వాత దక్షిణదేశము పెక్కురాజ్యము లాయెను. వీనిలోవీనికి కలహము లేర్పడెను. తమకు సాయముచేయుటకై ఈరాజ్యములు గోలకొండ బిజాపూరు మొదలైన మహమ్మదీయరాజ్యముల సాయమును వేడుటచే తురుష్కుల పలుకుబడి హెచ్చసాగెను. మొగలాయీల బలముచే ఉత్తరమున రాజ్యమును విస్తరించుట అసాధ్యమైనందున బిజాపుర గోలకొండరాజ్యములు దక్షిణమునకు వ్యాపించుటకు ప్రయత్నించుచుండినవి. ఇందుచే గోలకొండవారు కడప, ఉత్తరార్కాడు జిల్లాల భాగమును పాలారువఱకును జయించిరి. బిజాపూరువారు కర్నూలు, బెంగళూరు, ఉత్తరముననున్న మైసూరు భాగములను, పాలారు కొల్లడముల నడిమి మదరాసుభాగమును, వేలూరు మొదలు తంజావూరువఱకు ఆక్రమించిరి. శివాజీ సోదరుఁడైన వెంకాజీ

3