పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

అక్కన్న మాదన్నల చరిత్ర

మీఁదికి దాడివచ్చినప్పు డంతయు తమసైన్యములను ఎల్లల కడకు పంపుచుండిరి. మొగలాయీలు తాము బిజాపూరుమీఁదికి దాడి వెడలినయెడల గోలకొండవారు తమసైన్యముమీఁదికో తమరాజ్యముమీఁదికో దండెత్తివచ్చి బిజాపురమువారికి సహాయముచేయుదురని ఎఱిఁగియుండిరి.

మాదన్న ఈమార్గమునే యనుసరించెను; బిజాపురము వారితో విరోధింపలేదు, స్నేహమే చేయుచుండెను. కాని బిజాపురవ్యవహారము ఇప్పుడు చాల గందరగోళముగానుండెను. అంతఃకలహములు జరుగుచుండినవి. ఇట్టిరాజ్యముతో స్నేహము ఈకాలమున అసాధ్యముగాను నిరుపయోగముగాను నుండెను. ఈవిషయములెల్ల మాదన్న ఆలోచించెను; నిరంతరము జయముగాంచుచుండిన మహారాష్ట్రులతో స్నేహము మొదలుపెట్టెను; శివాజీతో నుత్తరప్రత్యుత్తరములు ప్రారంభించెను.




ప్రకరణము ౭ - శివాజీ

క్రీ. శ. 1674లో శివాజీ పట్టాభిషేకము చేసికొనెను. అందుచే నాతనిబొక్కసము చాల తగ్గిపోయెను. తర్వాత నతఁడు బిజాపూరు రాజ్యమునందు చాలచోటులలో దోపిడి చేసినను ఎక్కువధనము దొరకలేదు. దక్షిణాపథమునందలి పలుచోటులను ఆతఁ డప్పటికే దోచియున్నాఁడు. ఈతని దాడికి భయపడి పెక్కువ్యాపారస్థలములు పాడైపోయినవి. దక్షిణ