పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

అక్కన్న మాదన్నల చరిత్ర

విరోధికృత్సంవత్సరము మాఘ శుద్ధ పంచమినాఁడు (క్రీ. శ. 1672 జనవరి 21వ తారీఖున) శంఖుస్థాపన మొనర్చి మూఁడు నెలలలో కట్టడము పూర్తిచేసి, శకము 1594 పరీధావి వైశాఖ శుద్ధ సప్తమినాఁడు (క్రీ. శ. 1672 ఏప్రిలు 22 తేది) గృహప్రవేశ మొనర్చిరి.




ప్రకరణము ౬ - మాదన్న పరిపాలనాప్రారంభము

మాదన్న కావించిన మహోపకారమునకు తానాషాకు ఆతనియం దపారమైన నమ్మకమును ప్రియమును ఏర్పడెను. సర్వాధికారమును మాదన్నకే వదలి తాను వినోదాదికములలోను విద్యావంతులతోను కాలము గడుప నారంభించెను. మాదన్న తత్క్షణమే సామ్రాజ్యములో గొప్ప మార్పు లేవియు తేలేకపోయెను. రాజ్యరక్షణమే ప్రధానముగా నుండెను. అధికారమునకు వచ్చినవెంటనే అక్కన్న మాదన్నలకు తలతిరుగ లేదు. ఈ మహోపకారమొనర్చిన సుల్తానుపై వారికి అపార భక్తి యేర్పడెను. ఆతని పూర్వచరిత్రమంతయు గ్రహించిన వెనుక నాతఁడు కేవలమొకజ్ఞాని ఈరూపున నున్నాఁడని తలంప సాగిరి. అట్టిప్రభువును కొలుచుట మహాభాగ్యమని తలంచిరి. అనుదినమును ఉదయము కచేరికిపోయి సుల్తానునకు నాటివిషయములెల్ల విశదీకరించి తాము చేయఁబోవువానిని మనవిచేసి ఆతని యనుమతి నందుచుండిరి. మునుపటి వజీర్లకును వీరికిని ఎంత భేదము! ముజఫరుమూసాలు తానాషాకు ఏమియు చెప్పెడి