పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౪ - అక్కన్న మాదన్నల స్వప్నములు

21

పట్టి చెరసాలయం దుంచిరి. వెంటనే అబుల్‌హసనును సింహాసన మెక్కించి పైయిరువురును మంత్రులైరి. ఇతఁడే సయ్యద్ ముజఫర్, సర్వసేనాపతి, మహామంత్రి, అక్కన్న మాదన్నలను తానాషాదగ్గరకు తెచ్చినవాఁడు. ఈ మంత్రియొక్క అధికార వాంఛయు తలపొగరుతనమును తానాషాకు భరింపరాక యుండెను. తన మంత్రులను దుర్మార్గులను తొలఁగించుట కాతఁడు తరివేచియుండెను. అందులకు తగినసహాయులు దొరకలేదు. అక్కన్న మాదన్నలను చూడఁగానే వీరు తనకీ కార్యమునకు ఉపకరింతురని తానాషా తలంచెను. వారివారి నడుగుటచే అక్కన్నమాదన్నలకు ఇంత పూర్వచరిత్రము తెలిసినది.




ప్రకరణము ౪ - అక్కన్నమాదన్నల స్వప్నములు

అక్కన్న మాదన్నలు తానాషాకొలువులో ప్రవేశించి వారము దినములైనవి. అనుదినము రాజగృహమునకు పోవుచు తమ యుద్యోగమును నిర్వహింప మొదలిడిరి. చాల సులువుగా వీరు అన్ని కార్యములను చూచుకొనుటచే ఇతరులు మహమ్మదీయులు పెక్కింటికి వీరి సాయమపేక్షింపసాగిరి; మిత్రులేర్పడిరి. సుల్తాను రహస్యముగా వీరి శక్తిసామర్థ్యములను పరీక్షించు చుండెను. ఆయవ్యయ విధానములలో వీరు లెక్కలు తయారు చేయుటను చూడవలెనను మిషతో వీరిని తన కులయత్ ఖానాకు పిలిపించుకొని ప్రసంగించుచుండెను. వారితండ్రి