పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము 3 - తానాషా పూర్వచరిత్ర

17

నది. ఇది క్రమముగాముదిరి జగడమునకుదిగి, సరిగా సయ్యదు సుల్తాను పెండ్లినాటికి ఆపెండ్లి మాన్పవలసినట్లు వచ్చెను. పెద్దయల్లుని కోపమునకు సుల్తాను భయపడెను. సయ్యద్ సుల్తానుయొక్క పెండ్లివేషమును లాగివేసి రాజ్యమునుండి తఱుమఁగొట్టి ఆతనియింటిని రాజభటులు కొల్ల గొట్టిరి.

తర్వాత జోస్యులుపెట్టిన లగ్నము దాఁటిపోనీయక ఆదినమే సుల్తానుయొక్క మూఁడవకుమార్తెకు వివాహము నెఱవేర్పవలసి యుండెను. రాజమంత్రులు వరాన్వేషణ మొునరింపసాగిరి. బలవంతుఁడును బుద్ధిమంతుఁడు నైనవాఁడు సుల్తానునకు అల్లుఁడైన తనకాపదయని పెద్దయల్లుఁడును అట్లే మంత్రులును తలంచి వ్యర్థుఁడెవఁడైన దొరకునా యని వెదుకసాగిరి. వారికి అబుల్‌హసౝ అనువాఁడు దొరకెను. ఇతఁడు తండ్రి పార్శ్వమున రాజబంధువు. ఆతండ్రి గొప్పవర్తకమును సాగించి మరణించినను తన యవసానకాలమున నేమియు మిగుల్పనందున అబుల్‌హసౝ పేదరిక మనుభవించుచుండెను. వివాహ దినము నాటికి పదునాలుగు సంవత్సరములుగా నీతఁడు సయ్యద్ రాజుకొత్తాల్ అను మహమ్మదీయస్వామికి శిష్యుఁడై వారి సాంగత్యమందే కాలము గడపుచుండెను. తండ్రి చనిపోవునప్పుడు పదునాలుగేండ్లు, ఇప్పుడు ఇరువదియెనిమిది.

ఈ మహమ్మదీయ సన్న్యాసి సంస్కృతాంధ్రములలో కూడ కవి, వేదాంతి, పండితుఁడు. ఈతఁడు తానాషాకాలమున గోలకొండలో మహాతపస్వి యని ప్రసిద్ధినందియుండెను.

2