పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౩ - తానాషా పూర్వచరిత్ర

15

ఆ మూఁడవనాఁడే దండోరా వినిరి. నాఁడే సుల్తాను దర్శనముసు వసారత్ ఉద్యోగలాభమును. మెల్లమెల్లగా పైకివచ్చి ఎన్నఁడో సుల్తానుదర్శన మగుటకన్న తలవని తలంపుగా నొక్కదెబ్బతో వారికి సుల్తాను దర్శనమైనది. దర్బారువీడి బసకు వచ్చినవెంటనే వారు తమయదృష్టమును తండ్రికి చెప్పి పంపిరి.

అక్కన్నమాదన్నలకు తానాషా వేదాంతవాక్యములు వినినది మొదలు ఆతఁడేల అట్లు మాటలాడెనో, ముజఫరుఖానుఁడు తమపై నేల యసూయవహించెనో కనుఁగొన వలయునని కుతూహలము పొడమినది. వారు అటనట విచారింపఁగా నీక్రింది విషయములు తెలిసినవి.

గోలకొండ సుల్తానులలో అబ్దుల్లాకుతుబుషా ఆఱవవాఁడు. ఈతఁడు తనతండ్రి మరణానంతరము క్రీ. శ. 1626లో పండ్రెండేండ్ల వయసున రాజ్యమునకు వచ్చి నలువదియాఱు సంవత్సరముల కాలము పరిపాలించెను. ఈకాలమం దంతయు నాతఁడు ఇతరుల చేతి కీలుబొమ్మయై యుండెను. నలువది యేండ్లకుపైగా నీతని రాజ్యతంత్రము నంతయు నీతని తల్లి హయత్‌బక్ష్‌బేగమ్ అనునావెు నడపుచువచ్చెను. ఈమె బలవంతురాలు, దర్పముతో నిర్వహించినది. ఈమె చనిపోయిన తర్వాత అబ్దుల్లా తన పెద్దయల్లుఁడైన సయ్యద్ అహమ్మద్ అనువానికి సర్వవిధముల వశవర్తి యైయుండెను.