పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౨ - తానాషా దర్బారు

11


మెందులకు పుట్టితిమో, ఏమికానున్నామో, ఎక్కడికిపోఁగలవెూ, ఎప్పడుపోఁగలమో, ఎట్లుపోఁగలమో, ప్రాణమేమి, ఆత్మయేమి — ఏమియు తెలియదు. ఇదంతయు తెలిసినట్లు కొందఱు అభినయము చేయుచుందురు. అదియొక టక్కు. అందుచేత మనము ప్రాణముతోనుండు నీనాలుగు దినములును సంతోషముగా నుందము. ‘భాయి భాయి’గా సోదరస్నేహము నెఱపుకొందము. ఎవరికిని కష్టముండరాదు. సాధ్యమైనయెడల నలువురకు ఉపకారము చేయుదము. ఎవరికాలము వచ్చినప్పడు వాఁరు పోఁగలరు, మీఋషులు చెప్పునది అదే. మాసూఫీల వేదాంతమును అదే.

అక్కన్నమాదన్నలు ఆశ్చర్యపడిరి. ‘తాము గొప్ప వేదాంతి మహాప్రభూ’ అని పలికిరి. ఈసంభాషణయంతయు ముజఫరునకు అతని తోడివజీరును మహల్దారు ఉద్యోగియు నైన మూసాఖానునకును ప్రియముగా నుండలేదు. వారు, ‘నౌకరు లింకను ఆ ఇనయత్‌నామాను తేలేదే’ యని వేదనపడుచుండిరి. పాదుషావారి రాయబారి, తానాషా వాక్యములలో ఔరంగజేబుపై దూషణ ఏమైనను ధ్వనించుచున్నదా యని ఆలోచించుచుండెను. ఇంతలో నౌకరులు ఆజాబునుతెచ్చిరి. ముజఫరు దాని నందుకొని సుల్తానుముందు నిలువఁబడెను.

తానాషా ― దయచేసి చదువుఁడు

మాదన్న ఆ తెల్లని కాగితమును గ్రహించి, ‘మహాప్రభూ ఇందలి విషయములు చాల రహస్యములు. తమకు మాత్రమే తెలియవలెను.’ అనెను.