పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

అక్కన్న మాదన్నల చరిత్ర

 అక్కన్న ― మహాప్రభువులవారి యనుగ్రహము కలుగుట భగవంతుని యనుగ్రహము కలుగుటయే. ఏలినవారి దర్శనమైన సంతోషములో మాకు నోట మాటలుకూడ సరిగ వచ్చుట లేదు ప్రభూ.

మాదన్న ― జగద్రక్షకా, తమయనుగ్రహము కలిగిన నేఁడే మాజన్మమునకు మంచిరోజు. ఏలినవారికి ప్రియముగా నౌకరిచేసి మా రక్తమాంసములు గోలకొండకును ఈయాంధ్ర సామ్రాజ్యమునకును ధారపోయుటకు సిద్ధముగా నున్నాము. ఏదినము అట్టి సందర్భముకలుగునో నాఁడే మాజన్మము పావనము అగును. మావలన పనిగొనుము మహాప్రభూ.’

అబ్దుల్‌రజాక్‌లారీ ― అచ్ఛా, ఆచ్ఛా. చక్కఁగా చెప్పినారు మాదన్నపంతులుగారు. ఈగోలకొండకు మీరు రక్తమాంసములు ధారపోయుదురేని మేము మాప్రాణమును శరీరమును అర్పింపఁగలము. అల్లాకటాక్షము చక్కఁగా నుండునెడల ఇటువంటిరాజభక్తియు దేశభక్తియు గల రాజ్యమును ఆ రావణాసురుఁడు కూడ పట్టలేఁడు. విూ వంటివారు మాకు అవశ్యముగా న్నేహితులుగా నుండవలెను.

తానాషా ― అచ్ఛా, అచ్ఛా. మనకు అందఱును స్నేహితులే. అందఱును అన్నలును తమ్ములును. మాదికూడ సామాన్యప్రాణమే. భగవంతుని వేడుక కొఱకు మేము ఇచ్చట సింహాసనముపై నున్నాము. ఈప్రపంచమంతయు ఒక ఆశ్చర్యము, సందేహము, మోసము, తమాషా, గమ్మత్తు. మన