పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

అక్కన్న మాదన్నల చరిత్ర


ములలోనుండువారిని కనిపట్టుటకు కాలము పట్టుచున్నది. దొరకకపోరు; మేధావులున్నారు.

సభలో సుల్తానునకు చెంతనేయుండిన యొక ముసలి వజీరు అబ్దుల్ రజాక్‌లారీ యనునతఁడు ఇట్లనెను. ‘సుల్తాన్బహద్దర్, మనకు కొంత నెమ్మది కావలెను. మనయీ యాంధ్రదేశము, సుల్తానువారు సెలవిచ్చినట్లుగా, చాల విస్తీర్ణమైనది. శ్రీకాకుళము మొదలు పుదుచ్చేరి వఱకు మూల మూలలకు, అన్ని ఠాణాలకు, మనుష్యులు పోయియున్నారు. తెలంగాణములో నిత్యము దండోరా వేయుచున్నాము. ఈదేశములో హిందువులు మహమ్మదీయులు అందఱును బుద్ధిమంతులు. ఎవరో దొరకకపోరు.’

ఇట్లు వీరు మాటలాడుచుండఁగానే పహరాజవాను వచ్చి మోకాళ్లమీఁద నిలిచి ఖుర్నీషుసలాములు చేసి, ముజఫరుసేనాపతిగారును వారితో ఆజాబును చదువగల వారిగుమాస్తాలును వచ్చియున్నారని నివేదించును. సుల్తానువారి యుత్తరు వైనంతనే ప్రభువు కొలువునకు, ముజఫరుముందు నడచుచుండ ఆయాంధ్రయువకులు వెంటనంటి పోయిరి. కొలువు కూటము చేరి నంతనే అందఱ చూపులును ఆయువకుల విూఁదనే పడినవి. వీరేదో యాశ్చర్యకరమైన పని చేయఁబోవుచున్నారని సభ్యులును పరివారమును తలంచుచుండిరి.

ఆయువకుల వేషము చాల వినీతముగా నుండెను. — దోవతియు, పొడుగుచొక్కాయయు పైన సన్నని యంగవస్త్ర